మీరు అమరావతి కి వెళ్తే ఈ గుడిలో ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని తీరాలి

Advertisements

అయిదు కోట్ల ఆంధ్రుల కలకు ఆ ఏడు కొండల వెంకన్నే అండ. ఆంధ్రుల రాజధాని అమరావతి శోభకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే ప్రత్యేక ఆకర్షణ. ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని అమరావతి తీసుకొచ్చే మహాయజ్ఞాన్ని 18 ఏళ్ల కఠోర శ్రమతో నిజంచేస్తున్నారు విజయవాడకు చెందిన లింగమనేని కుటుంబ సభ్యులు. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి మహోన్నత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నంబూరు సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా అత్యంత శోభాయమానంగా రూపు దిద్దుకుంది. ప్రపంచ స్థాయి రాజధానిలో ప్రపంచంలోనే తొలి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టపన మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. అమ‌రావ‌తికే మ‌రో మ‌ణి హారం. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం… తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుని మ‌రో దివ్య అవ‌తార‌మే ఈ దశావ‌త‌ర వేంక‌టేశ్వ‌ర‌స్వామి. క‌లియుగంలో వెంక‌టేశ్వ‌రుడిని మించిన శ‌క్తివంత‌మైన దైవం మ‌రొక‌టి లేదు. ఆ శక్తి స్వరూపుని ప్రతిష్టాత్మక ఆలయం నంబూరు రెయిన్ ట్రీ పార్కు ప‌క్క‌న అత్యంత వైభ‌వోపేతంగా నిర్మితమైంది. ఈ ఆలయం రాజ‌ధానికే మ‌ణి మాణిక్యం.

అమ‌రావ‌తికే అలంకార ప్రాయం. పూజ్య గురూజీ శ్రీ శ్రీ శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి వారి దివ్య ఆశిస్సుల‌తో ఈ ఆల‌య ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింది.క‌లియుగంలో కొంగుబంగార‌మై ప్ర‌కాశిస్తున్న వెంక‌టేశ్వ‌ర‌స్వామి… దుష్ట శిక్ష‌ణ‌, శిష్ఠ ర‌క్ష‌ణ‌ ధ‌ర్మ ర‌క్ష‌ణ‌కు, 21 అవ‌తారాలు ఎత్తాడు. వాటిలో ముఖ్య‌మైన‌ 10 అవ‌తారాల‌తో కూడినదే ఈ ద‌శావ‌తార ఆల‌యం. లింగ‌మ‌నేని పూర్ణ‌భాస్క‌ర్‌, లింగ‌మ‌నేని వేంక‌ట సూర్యరాజ‌శేఖ‌ర్‌, లింగ‌మ‌నేని ర‌మేశ్‌, గ‌ద్దె శ్రీ‌ల‌క్ష్మి గార్లు అత్య‌ద్బుత ఆల‌యం నిర్మించాల‌న్న ఆశ‌యంతో గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామివారిని సంప్ర‌దించి ఈ మ‌హ‌త్త‌ర సంక‌ల్పాన్ని చేప‌ట్టారు. ఈ మహత్తర ఆలయ నిర్మాణ సంకల్పనికి బీజం కూడా తిరుమల కొండపైనే పడింది. కలియుగ దేవదేవుని నిత్యం దర్శించుకునే లింగమనేని కుటుంబ సభ్యులు ఆ తిరుమల కొండపైనే ఒక మహోన్నత ఆలయాన్ని నిర్మించాలని భావించారు. 2000 సంవత్సరంలో కలిగిన ఈ ఆలోచన 2006లో కార్యకరూపానికి వచ్చింది. ఈ విషయాలను విజయవాడకు చెందిన లింగమనేని రమేష్ వెల్లడించారు. ఆయన ఎమ్మన్నారంటే… “ఈ ఆల‌యం నిర్మించాల‌న్న‌ది 18 సంవ‌త్స‌రాల సుదీర్ఘ య‌జ్ఞం. 2000 సంవ‌త్స‌రంలో నాలో మొద‌లైన అపూర్వ క‌ల‌. తిరుమ‌ల స్వామివారి ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌లిగిన ఆలోచ‌న ఈ రోజున కార్య‌రూపం దాల్చ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం. ఈ విగ్ర‌హ రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి ఆరేళ్లు ప‌ట్టింది. దశావ‌తారం అనుకుని మ‌రో ఆరేళ్లు నిర్విరామ కృషి

త‌ర్వాత 2012లో దీని నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఇంకో నాలుగేళ్లు శిల్పుల క‌ష్టంతో ఈ ఆల‌య వాస్తవ రూపం దాల్చింది” అని రమేష్ ఆనందోత్సాహాలు ప్రదర్శించారు. ఈ ఆలయంలో మ‌హాల‌క్ష్మి, మ‌హాగ‌ణ‌ప‌తి, గ‌రుడ అళ్వార్‌, విష్వ‌క్షేన‌ విగ్ర‌హాల‌ను కూడా ప్ర‌తిష్టించారు. ఈ ఆలయ నిర్మాణంతో న‌వ్యాంధ్ర‌కే నిత్య శోభ తీసుకొచ్చారు. దేవ లోకానికి, ఇంధ్ర లోకానికి, న‌వ‌గ్ర‌హాల‌కు, స‌క‌ల వైభ‌వ‌లాకు, ముక్కొటి దేవ‌త‌ల‌కు, అల‌వాల‌మై ప్ర‌కాశించిన అమ‌రావ‌తి శోభ‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమ‌రావ‌తికి తీసుకొచ్చేందుకు ఈ మ‌హ‌త్త‌ర కార్యాన్ని చేప‌ట్టారు. మ‌రో రెండు రోజుల్లో ఈ ఆల‌యంలోని ద‌శావ‌తార వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునే భాగ్యం భ‌క్త‌జ‌న‌కోటికి క‌ల‌గ‌నుంది. ద‌శావ‌తార వెంకటేశ్వ‌ర స్వామి దివ్య ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు లింగ‌మ‌నేని ర‌మేశ్ వెల్ల‌డించారు. 21న యోగా డే సంద‌ర్భంగా ప్ర‌త్యే కార్య‌క్ర‌మాలు, సాయంత్రం రాఘ‌వేంద్ర‌రావు ర‌చించిన ప్ర‌త్యేక గీతాల ఆవిష్క‌ర‌ణ‌, 22న కుంభాభిషేకాన్ని నిర్వ‌హించ‌నున్నారు. శుక్ర‌వారం ప్ర‌తిష్టా మ‌హోత్స‌వానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం ముగిసిన త‌ర్వాత అన్న‌దానం జ‌రుగుతుంది. ఇందుకోసం 20 కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో జ‌రిగే ఏర్పాట్ల‌కు తీసిపోకుండా స‌క‌ల సౌక‌ర్యాల‌తో అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. 23న శ‌నివారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు శ్రీ‌చ‌క్ర అర్చ‌న‌, అనుగ్ర‌హ బాష‌ణం, ఆ త‌ర్వాత వెంక‌టేశ్వ‌ర స్వామివారి క‌ల్యాణం వైభ‌వోపేతంగా జ‌రుగుతంద‌ని వివ‌రించారు.

ధ్రుఢ‌మైన సంక‌ల్పంతో చేపట్టిన ప‌ని ఎప్పుడైనా విజ‌య‌వంతం అవుతుందని గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి అన్నారు. “భ‌గ‌వంతుడు పెట్టే ప‌రీక్ష‌ల్లో మ‌న‌మంతా గెల‌వాలి. ధ‌ర్మం నిల‌వాలి అంటే ప్ర‌తి ఇంటికి ఒక ఆల‌యం ఉండాలి. హిందూ ధ‌ర్మానికి ప్ర‌తీక‌గా ఉండే ఆల‌యాల‌ను అన్నిచోట్ల నిర్మించాలి. ఇదే మ‌హాత్త‌ర సంక‌ల్పంతో లింగ‌మ‌నేని కుటుంబం మొద‌లు పెట్టిన మ‌హాయ‌జ్ఞం అనేక దైవ ప‌రీక్ష‌ల ఎదుర్కొని ఈ రోజు ప్ర‌తిష్టప‌న జ‌రుగుతోంది. ఆ మ‌హాత్త‌ర ఆల‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తికే కొత్త శోభ‌. ద‌శావ‌తారల‌తో ఉన్న ఈ పూర్ణ ఆల‌యం ప్ర‌పంచంలోనే తొలి ఆలయం” అని గణపతి సచ్చిదానంద పేర్కొన్నారు.

Advertisements

Leave a Reply