ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ఫిబ్రవరి 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. గురువారం(జనవరి 21) సాయంత్రమే యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక షోలు వేశారు.ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ జనవరి 9న విడుదలై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద ఫెయిలైంది. మొదటి భాగం మొత్తం రామారావు సినీ జీవితం ఫోకస్ చేస్తూ రూపొందించారు. రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ రామారావు రాజకీయరంగ ప్రవేశం, పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం, ఆతర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెంచింది.కథానాయకుడు ఫ్లాప్ కావడంతో మహానాయకుడుపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. నందమూరి అభిమానులు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే మహానాయ‌కుడు చిత్రాన్ని తెరకెక్కించాడు క్రిష్.. మరి అది ఎలా ఉందో మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం


నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వచ్చే పాత్ర కావడంతో తండ్రి పోలికలతో కనిపించాడు.

విద్యాబాలన్ చాలా బాగా నటించింది. తొలి భాగాం లోనే ఆవిడ నటనకి ఎక్కువ పేరు వచ్చింది.

నాదెండ్ల భాస్కర రావు పాత్రలో అద్భుతంగా నటించాడు స‌చిన్ ఖేడ్ ఖ‌ర్.

నందమూరి హరికృష్ణ పాత్రలో క‌ళ్యాణ్ రామ్ బాగున్నాడు, ముఖ్యంగా తండ్రి వెనుక నీడలో అద్భుతంగా నటించాడు.

రానా చంద్ర‌బాబు పాత్ర‌లో ఆయ‌న ప్రాణం పెట్టి న‌టించాడు. ముఖ్యంగా చంద్రబాబు పాత్ర ఈ సినిమాలో కీలకం కావటంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

క‌థానాయ‌కుడుతో పోలిస్తే కీర‌వాణి ఈ సినిమాకు అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.

పాట‌లు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రెండు పాటలు బావున్నాయి.

ఎడిటింగ్ అద్భుతంగా ఉంది, ఎక్కడ డల్ మూమెంట్స్ లేకుండా వేగంగా ముగించాడు.

సినిమాటోగ్ర‌ఫ‌ర్ ప‌నితీరు కూడా బాగుంది, ముఖ్యంగా అసెంబ్లీ సన్నివేశాల్లో లైటింగ్ అద్భుతమ్ గా ఉంది.

ద‌ర్శ‌కుడిగా క్రిష్ ఈ సారి ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతమైన పని తీరు కనపరిచాడు.


ఓవరాల్ గా చప్పగా ఉన్న కథానాయకుడు కంటే ఈ సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలు, ఎన్టీఆర్ మీద జరిగిన భారీ కుట్ర లో తెర వెనుక నిజాలు సరిగ్గా ఆవిష్కరించారు. నాదెండ్ల ఎలా కాచుకుని ఉన్నది, ఇందిరా ఎలా సహకరించింది అన్ని చూపించారు. ఆయన జీవితాన్ని బసవతారకం గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిష్కరించటంతో ఆవిడ చనిపోగానే సినిమా ముగిస్తుంది.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.75/5