కోడి కత్తి వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ సానుభూతి కోసం చేసుకున్న కుట్ర అని తెదేపా అంటుంది. తాజాగా అంటుంటే తెదేపా కుట్ర అని వైకాపా వారు అంటున్నారు. ప్రజాసంకల్పయాత్ర 299వ రోజు విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన సభలో తనపై జరిగిన దాడి గురించి తొలిసారి నోరువిప్పారు. తనను చంపేందుకు చంద్రబాబు కుట్రచేశారని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో జరిగిన కత్తి దాడి వెనక చంద్రబాబు హస్తముందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం విచారణపై నమ్మకం లేదని..స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని జగన్ ప్రశ్నించారు. టీడీపీ నేతల అవినీతి, విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన, ఓటుకు నోటు కేసుల నుంచి తప్పించుకునేందుకే సీబీఐని రాష్ట్రానికి రానీయకుండా జీవో తెచ్చారని నిప్పులు కురిపించారు. జగన్ ఒక పక్క తెదేపా ను దిశగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగానే జగన్ కి ఒక షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే

కోడి కత్తి దాడి కేసులో వైసీపీ అధినేత జగన్‌కు విశాఖపట్నం కోర్టు సమన్లు జారీ చేసింది. కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న రక్తపు మరకల చొక్కాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నవంబరు 23 ఉదయం 11 లోపు కోర్టుకు అందజేయాలని విశాఖ ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టంచేసింది. జగన్‌పై దాడి కేసుపై విచారణ జరుపుతున్న సిట్‌..సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ ప్రకారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం రక్తపు మరకలున్న చొక్కాను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, అక్టోబరు 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశారు. దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం ..విచారణలో నిందితుడు శ్రీనివాస్ నుంచి కీలక వివరాలను కూపీలాగింది. అటు ఈ కేసులో సీఎం చంద్రబాబుతో పాటు 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ చొక్కా ను సమర్పించకపోతే తదుపరి పరిణామాలు ఏంటి అనేదాని మీద విస్తృత చర్చ సాగుతుంది. అయితే జగన్ మీద దాడి జరిగినప్పుడు చొక్కా చిరగలేదని, అది హత్యా ప్రయత్నం ఎలా అవుతుందనే విమర్శలు వచ్చాయి.అయితే సిట్ ఒక పక్క ఉధృతంగా దర్యాప్తు జరపటం, పాద యాత్రలో ఉన్న జగన్ కు అంచెల భద్రత కలిపించటం తో పాద యాత్ర ఎప్పటిలానే ప్రశాంతంగా సాగుతుంది, అయితే ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 23 మీద ఉండటం ఆసక్తి కలిగిస్తుంది. దీనితో జగన్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది.