తెలంగాణ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకరకమైన ప్రభంజనాన్ని సృష్టించిన అధికార తెరాస పార్టీ, ఆ తతరువాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంతలా రాణించలేదని చెప్పాలి… కానీ కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తనదైన ప్రతిభను కనబరిచిందని చెప్పాలి. కాగ్ తెలంగాణాలో ఉన్నటువంటి కొందరు ముఖ్యనేతలను ఓడించి మరి బీజేపీ పార్టీ తన సత్తా చాటిందని చెప్పాలి. అయితే ఇకపోతే తెలంగాణ లో బలపడాలని భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఇక తెరాస పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను తమ పార్టీలోకి లాకోవడానికి బీజేపీ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తూందని చెప్పాలి. కాగా కాగా ఈమేరకు కొందరు తెరాస నేతలు బీజేపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే తెరాస పార్టీ కూడా ఖాళీ అవుతుందని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు.

అయితే తెలంగాణలో ఇటీవలే రెండవసారి జరిగినటువంటి మంత్రి వర్గ విస్తరణలో కూడా మంత్రి అడవులు రానటువంటి కొందరు కీలక నేతలు కూడా ప్రస్తుతానికి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అయితే వారిని కూడా బీజేపీ లోకి లాక్కోడానికి రంగం సిద్ధం చేసింది బీజేపీ పార్టీ. కాగా బీజేపీ లో తమ సంఖ్యా బలాన్ని పెంచుకోడానికి బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. అంతేకాకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీజేపీ పార్టీ ప్రారంభించిందని చెప్పాలి. అయితే తెరాస లో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కొందరు బీజేపీ లో చేరబోయేది వీరే అంటూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారెవరంటే… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ ఎస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జానాగావ్ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా గులాబీ టార్గెట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. మీడియా వర్గాల్లో ప్రస్తుతం ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి నిజానిజాలు ఎలా ఉన్నాయి.