ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసివచ్చే అంశంపై వైసీపీతో మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్‌తో చర్చలు జరపాలని కేటీఆర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆయన ఆదేశాలు పంపారు. బుధవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. రాజకీయంగా తొలిసారి కేటీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చలు జరపనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాల్లో భాగంగా బుధవారం ఆయన తనయుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్..హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో భేటీకానున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్ జగన్‌తో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బోండా ఉమ మాట్లాడుతూ ‘‘ ఏపీలో టీడీపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్, కేసీఆర్ డైరెక్షన్లో జగన్ పనిచేస్తున్నారు. ముసుగు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేదే లేదు. ఎవరెన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాల్లో గెలవబోతోంది.’’ అని అన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ‘‘మోదీ డైరెక్షన్లో జగన్, కేసీఆర్ నడుస్తున్నారు. చీకటి ఒప్పందం బయటపడింది. మోదీనే కేసీఆర్‌తో ఫెడరల్ ఫ్రంట్ పెట్టించారు. రాష్ట్రాన్ని, చంద్రబాబును దెబ్బతీయాలని ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో కుట్రలు చేస్తున్నారు.’’ అని అన్నారు.