నిన్న జరిగిన పల్నాడు సంఘటనతో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లేని ఉత్సహాన్ని తీసుకోని వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిన నాటి నిన్నటివరకు టీడీపీ నేతలు ఎవరు కూడా పెద్దగా యాక్టీవ్ గా లేరు. చాలా మంది నేతలు పార్టీలు మారారు. మరికొంత మంది నేతలు అదే దారిలో ఉన్నారు. టీడీపీలో ఉంటే తమకి రాజకీయ భవిష్యత్తు ఉండనని చాలా మంది నేతలు అనుకున్నారు, అలాంటి సమయంలో పల్నాడు సంఘటన వలన ఆలా అనుకుంటున్నా తెలుగు తమ్ములు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న టీడీపీ నేతలు రోడ్డు మీదకి వస్తామంటేనే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే టీడీపీ నేతలు ఎక్కడ రోడ్లు మీదకి వస్తే ప్రభుత్వానికి భారీగానే డ్యామేజ్ కలుగుతుంది అనే భయం వైసీపీ నేతలకి ఉన్నట్లు తాజాగా సంఘటనతో రుజువైంది. దీనితో అరెస్ట్ లు చేశారు. దీని వలన టీడీపీకి పెద్ద స్థాయిలోనే మైలేజ్ వచ్చింది, వైసీపీని తట్టుకునే శక్తి ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని గట్టిగానే రుజువైయ్యింది. దీనితో పార్టీ మారాలనుకున్న నేతలు ఆగిపోయినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా పార్టీ మారిపోతారనే మాటలు వినిపిస్తున్న భూమా అఖిలప్రియా, కేశినేని నాని, దేవినేని అవినాష్ లాంటి చాలా మంది నేతలు ఫుల్ యాక్టీవ్ మూడ్ లోకి ఈ ధర్నాలో పాల్గొన్నారు. వీళ్ళని చూసి మిగతా నేతలు కూడా పాల్గొన్నారు, ఒక్కే ఒక్క సంఘటనతో టీడీపీలో ఎక్కడ లేని ఉత్సహం వచ్చింది. నిరసించిపోయిన క్యాడర్ ఒక్కసారిగా పుంజుకుంది, బాబు కూడా చాలా రోజుల నుండి ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు, అది నిన్నటితో నెరవేరినట్లే అని అనుకోవచ్చు.