సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా మహర్షి రూపుదిద్దుకొన్నది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. సూపర్ స్టార్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అనే టాక్ అభిమానుల్లో ఇప్పటికే స్ప్రెడ్ అయింది. హిట్ సినిమాలను అంచనా వేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన దిల్ రాజు సైతం ఈ సినిమా తాను ఊహించని స్థాయిలో విజయం సాధిస్తుందని, ఫ్యాన్స్ ఎంత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నా దాన్ని రీచ్ అయ్యే కెపాసిటీ ఉన్న బొమ్మ అని చెప్పడంతో… అంచనాలు పెరిగాయ్. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనేక ప్రత్యేకతలతో మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం

మహేష్ బాబు కెరీర్లో లాండ్ మార్క్ ఫిలింగా వచ్చిన మహర్షితో మూడు వేరియేషన్స్ ఉన్న రిషి పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు

ముఖ్యంగా అమెరికా ఎపిసోడ్స్ లో మహేష్ చాలా అందంగా కనిపించాడు

పూజా హెగ్డే ఒక కీలకమైన పాత్రలో మెప్పించింది

ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు, మహేష్ తో కాంబినేషన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు

చిత్ర నిర్మాణ విలువలు బావున్నాయి, అమెరికా ఎపిసోడ్స్ లో లొకేషన్ కానీ, న్యూయార్క్ స్కై లైన్ కానీ చిత్రానికి చాలా బలంగా చేకూర్చాయి

దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పర్లేదు అనిపించినా, నేపధ్య సంగీతంలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి

ఎడిటింగ్ మీద మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది

సినిమాటోగ్రఫీ బావుంది, ముఖ్యంగా అమెరికా ఎపిసోడ్స్లో, పల్లెటూరు నేపథ్యంలో జరిగే సన్నివేశాల్లోను గొప్ప పనితనం కనపరిచారు

మూల కథ బలహీనంగా ఉంది, దాని చుట్టూ రాసుకున్న సన్నివేశాల విషయంలో, పతాక సన్నివేశాల్లో చాలా జాగ్రత్త వహించాల్సింది.

ముఖ్యంగా దర్శకుడు గా వంశి పైడిపల్లి చాలా చెప్పాలనుకుని, కలగాపులగం చేసాడనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కావాల్సిన డెప్త్ లేదు.

స్క్రీన్ ప్లే కూడా బలహీనంగా ఉంది, చాలా బలమైన సన్నివేశాలు సైతం తేలిపోయాయి

Mahesh Babu Maharshi Releasing Tomorrow Posters HD

మొత్తంగా చూస్తే ఇంకా బావుండొచ్చు అనిపిస్తుంది ఈ చిత్రం, దర్శకుడి వైఫల్యం వల్ల వెలితిగా ఉంటుంది. ప్రేక్షకుడి సైతం సహనాన్ని పరీక్షిస్తుంది. మహేష్ అభిమానులకు నిరాశ మిగిల్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మహేష్ స్టార్ పవర్ ఎంత మాత్రం పని చేస్తుందో చూడాలి. సమ్మర్ సీజన్ అవ్వటం కూడా కలిసి వస్తుందేమో చూడాలి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.5/5