ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతే అందరికీ ఆమోదయోగ్యం అని జేసీ అన్నారు. అయితే రాజధానిని విశాఖకు మారిస్తే రాయలసీమ తో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటుకు ఉద్యమం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు. సంక్రాంతి పండుగ తరువాత ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామని జేసీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తరహాలో పాలిస్తారని 151 సీట్లిస్తే వాటిని నిలబెట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేసారు. విశాఖ ని రాజధాని చేస్తే గోదావరి జిల్లాలకు మరియు ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు. తాను పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అన్న చందాన ముఖ్యమంత్రి పాలన ఉందని ఎద్దేవా చేసారు. బీసీజీ, జీఎన్ రావు, నిపుణుల కమిటీ నివేదికలు, ఇలా ఎన్ని నివేదికలు వేసిన ఉపయోగం లేదని, అవన్నీ ముఖ్యమంత్రి జగన్ కి అనుకూలంగా నివేదికలిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.