ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమాజం కి అన్ని తరగతుల వారు సంతోషించేలా సీఎం చంద్రబాబు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలంటూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ కేంద్రానికి పంపనుంది. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ‘దళిత క్రైస్తవుల్లో ఎంతోమంది పేదవాళ్లు ఉన్నారు. వారు వెనుకబడిన కులాల్లో ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ కులాల జాబితాలో చేర్చాలని తొలి నుంచీ టీడీపీ ప్రభుత్వం కోరుతోంది. దీనిని కేంద్రం అమలు చేసే వరకు వారికి అండగా నిలబడుతుంది’ హామీ ఇచ్చారు.