దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాదయాత్ర నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు ముందుకు ఈ సినిమా విడుదల కావడం హాట్ టాపిక్ గా మారింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 180 స్క్రీన్ లలో విడుదల చేయగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో 500 స్క్రీన్ లలో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 970 స్క్రీన్ లలో విడుదలైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది. పాదయాత్ర నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం.

దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మామూట్టి నటన బావుంది. కానీ ఆయన ఎక్కడ రాజశేఖర్ రెడ్డిలా అనిపించలేదు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట తీరు కానీ ఎక్కడ కనపడదు, మామూట్టి కనిపించారు

మిగతా నటీనటులు పర్వాలేదు.

ఈ చిత్రం లో ముఖ్యం గా సోల్ లేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని దేవుడు గా ఎస్టాబ్లిష్ చెయ్యాలన్న తాపత్రయం తప్పితే ఎక్కడా కూడా ఆయన ఏంటి, ఆయన విధానాలు ఏంటి, ప్రజల్లో ఎలా మమేకం అయ్యారు, పాద యాత్ర ఆయనలో తెచ్చిన మార్పు ఏంటి అనే విషయాన్ని చెప్పలేకపోయారు.

మహి వి రాఘవ్ మీద పని చేసిన కొన్ని ఒత్తిడులు జగన్ మోహన్ రెడ్డి రాజా శేఖర్ రెడ్డి కి అసలైన రాజకీయ వారసుడు అని చూపించేలా చేశాయా అనిపిస్తుంది. కొన్ని అనవసరపు విషయాలను ఎస్టాబ్లిష్ చేసారు

కెమెరా వర్క్ బావుంది

సంగీతం పర్వాలేదు

ఆర్ట్ వర్క్ బావుంది

ఎడిటింగ్ మీది మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది

కల్పిత సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి

ఇది వైఎస్సార్ కాంగ్రెస్ కి షో రీల్ లా ఉంది కానీ, ఎక్కడా కూడా దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లా అనిపించదు

మొత్తం గా చుస్తే వైకాపా అభిమానులకు, వైఎస్సార్ అభిమానులకు పర్వాలేదనిపించే ఈ చిత్రం మిగతా వారు, సాధారణ ప్రేక్షకుల సహనం పరీక్షించే ఒక డాక్యుమెంటరీ. ఎక్కడ కూడా డ్రామా కానీ ఎమోషన్ కానీ లేకుండా సాదా సీదాగా ఉంటుంది.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2/5