ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా అడుగుపెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక తర్వాత చేసిన హ్యపీ వెడ్డింగ్ కూడా ఈ భామకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. తాజాగా ఈ భామ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సూర్యకాంతం సినిమా చేసింది. నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన‌ ‘ సూర్యకాంతం` శుక్ర‌వారం విడుదలయింది. రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. సూర్య‌కాంతం అనే పేరును తమ పిల్ల‌ల‌కు పెట్ట‌డానికి కూడా భ‌య‌ప‌డే తెలుగు సంప్ర‌దాయంలో అదే పేరుతో ఓ సినిమా తెర‌కెక్కింది. ఇందులో సూర్యకాంతం చేసే ప‌నులేంటి? అనేది ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. త‌న వారిని ప్రేమ‌గా, ఇత‌రుల‌ను పుల్ల‌విరుపు మాట‌ల‌తో దూషించే సూర్య‌కాంతం సినిమా కేర‌క్ట‌ర్‌కు, ఈ సినిమాకు సంబంధం ఏంటి? వ‌ంటివి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.
ఈ మూవీతో నిహారిక హిట్ అందుకుందా లేదా మన బుల్లెట్ రివ్యూలో చూద్దాం..

నిహారిక సింగిల్ పేరెంట్ ఉన్న తింగరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రెజెంట్ జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయింది.

మరోవైపు హీరోగా నటించిన రాహుల్ విజయ్ ఉన్నంతలో పర్వాలేదనపించాడు.

మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి..ఒక వెబ్ సిరీస్ చేయాల్సిన కథతో సినిమాను తీసినట్టు కనబడింది.

దర్శకుడిగా హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రేజీగా మలిచిన ఆ పాత్ర చివరికంటూ ఒక లక్ష్యం లేని పాత్రగా మొత్తం కన్ఫ్యూజన్‌గా తీర్చిదిద్దాడు

ముఖ్యంగా కథ మొత్తం ఏదో సీరియల్ తీసినట్టు సాగతీతగా ఉంది.

ఫోటోగ్రఫీ కూడా ఏమంత బాగాలేదు. మ్యూజిక్ మాత్రం సోసో గా ఉంది

మొదటి హాఫ్ బాగానే సాగినప్పటికీ రెండవ హాఫ్ మొత్తం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ నే ఉంటుంది.

సినిమా కథ బలహీనంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలిచింది.

ఇక రెండవభాగంలో సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లు మరీ సాగదీసినట్టు అనిపించింది.

కొన్ని సీన్లు బలవంతంగా నవ్వు తప్పించాలి అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తాయి

మొత్తంగా చూస్తే అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయ్యిందనే చెప్పాలి. నిహారిక ఖాతాలో మరొక డిజాస్టర్ చిత్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు.

అంధ్రుడు.కామ్ రేటింగ్ : 2/5