‘మజిలీ.. మజిలీ.. మజిలి.. ఈ పేరు ఎంత హాయిగా ఉందో కదూ.. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ‘మజిలీ’.. టైటిల్ చాలా డీసెంట్‌గా ఉందే. సమంత నాగచైతన్యలు పెళ్లి తరువాత నటిస్తున్నారా? ఇది ఇంకా సూపర్. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారే. అబ్బా.. టీజర్ ఏమన్నా ఉందా.. ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారా’ ఏమైనా చెప్పాడా డైలాగ్. కసక్కున జనం మైండ్‌లోకి వెళ్లిపోతుందంతే. ఇక సాంగ్స్.. ఎన్నాళ్లైందో.. ఇలాంటి ప్యూర్ లవ్ ఎమోషనల్ సాంగ్స్ విని. అదిరిపోయాయి పాటలు. ఇంతకీ ట్రైలర్ చూశారా..? ‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే’ అంటూ రావు రమేష్ డైలాగ్ చెప్తుంటే.. ఫట్ మని మరచెంబుతో మొహాన్ని పగలగొట్టినట్టు ఉంది పెళ్లాన్ని డబ్బులడిగే మొగుళ్లకు. సమంత నటించనట్టు లేదు.. జీవించేసిందంతే. ఏ సినిమా మిస్ అయినా ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీని

అస్సలు మిస్ కాకూడదు’’.. ఇదీ సమంత, నాగ చైతన్య ‘మజిలీ’ చిత్రంపై ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్న భావన. మరి నిజంగానే సమంత-నాగ చైతన్యల జోడీ ప్రేమ మజిలీ అందించారా?నాగచైతన్య, సమంత, దివ్యాంశ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యూర్ లవ్ స్టోరీ ‘మజిలీ’ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక రకంగా చూస్తే చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి, మంచి కారెక్టర్ రాస్తే తన నటన చూపించే అవకాశం ఉంటుందని గత కొంత కాలంగా చెప్తున్నా చైతు కి సరైన రోల్ దొరికిందని చెప్పుకోవాలి.

నటన పరంగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న సమంతా కి ఇది మరొక మెట్టు ఎక్కే రోల్ అని చెప్పుకోవాలి. శ్రావణి గా తన పెర్ఫార్మెన్స్ సినిమాకి హై లెట్

మిగతా వారిలో రావు రమేష్ నటనా పరంగా మంచి మార్కులు సాధిస్తాడు.

ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఏమి లేకపోయినా, చిన్న చిన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఎడిటింగ్ బావుంది

సంగీతం నేపధ్య సంగీతం బలం అని చెప్పుకోవాలి. ముఖ్యముగా మూడు పాటలు ఆకట్టుకుంటాయి.

దర్శకుడు శివ నిర్వాణ ప్రయత్నం బావుందని చెప్పుకోవాలి. నిన్ను కోరి తో ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ చిత్రంతో దర్శకుడిగా తన స్థానం పదిలం చేసుకున్నాడని చెప్పుకోవాలి.

మొత్తంగా చూస్తే మజిలీ చాలా కాలం తర్వాత వచ్చిన మంచి ప్రేమకథా చిత్రం అని చెప్పుకోవాలి. ప్రేమ కథలు నచ్చేవారికి తప్పక నచ్చే చిత్రం. ఎన్నికల సీజన్, ఐపీఎల్ తట్టుకుని ఎలా నిలబడుతుందో చూడాలి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.5/5