నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం’జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈచిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. క్రికెట్ నేపథ్యానికి ఒక అద్భుతమైన స్టోరీ జోడించి ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి.నాని కెరియర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేనంత పాజిటివ్ బజ్‌తో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది జెర్సీ. టీజర్, ట్రైలర్‌లలోనే సినిమా స్థాయి ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా నాని వీరబాదుడు చూస్తుంటే ఈసారి గట్టి హిట్ కొట్టేట్టు కనిపిస్తున్నాడు. ఓ సినిమా కోసం నాని ఇంతిలా శ్రమపడటం బహుషా ఇది తొలిసారి. ‘మళ్ళీ రావా’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్‌ (36)గా కనిపిస్తున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి.

శ్రద్దా శ్రీనాథ్ తన పాత్ర పరిధి మేరకు బాగా చేసిందనే చెప్పుకోవాలి.

తమిళ సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం పెద్ద అసెట్ అయ్యింది

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మాణ విలువలు బావున్నాయి

ఫామిలీ డ్రామా సన్నివేశాలు కాస్త బోర్ అనిపిస్థాయి.

అయితే క్రికెట్ ఎపిసోడ్స్ ని ఆకట్టుకునేలా ప్రజంట్ చెయ్యటంలో గౌతమ్ తిన్నమూరి సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి.

తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన క్రీడా నేపధ్యం ఉన్న చిత్రాల్లో జెర్సీ నిస్సందేహంగా మంచి చిత్రం అని చెప్పుకోవచ్చు

ఒక వైవిధ్యమైన ఇలాంటి మంచి చిత్రాన్ని అందించింనందుకు జెర్సీ టీమ్ కి శుభాకాంక్షలు తెలియచేయాలి.

మొత్తంగా చుస్తే జెర్సీ తప్పకుండా చూడవలసిన చిత్రం,క్రికెట్ ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని మరింత ఇష్టపడతారు. వైవిధ్యమైన ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.5/5