సార్వత్రిక ఎన్నికలు ముగిసి 25 రోజులవుతున్నా గెలుపుపై లెక్కలు వేయడంలో ఇప్పటికీ ప్రధాన పార్టీలు మునిగి తేలుతున్నాయి. తమదంటే.. తమదే గెలుపని అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే లోలోపల మాత్రం గెలుపుపైన ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 275 పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓట్లు ఎలా పడ్డాయో అని చోటా నాయకులను పిలిపించి ముఖ్యనాయకులు ఆరా తీస్తున్నారు. గ్రామాల వారీగా.. కులాల వారీగా ఓట్లు ఎలా పడి ఉంటాయోనని ముఖ్యనాయకులు విచారిస్తున్నారు. తాము అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తప్పక గెలిచి తీరుతామని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. రాయచోటి అసెంబ్లీ బరిలో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీతో పాటు స్వతంత్రులు, చిన్నాచితక పార్టీలు కలిపి 9 మంది నిలిచారు. ఇందులో పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్య మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు. పోలింగ్‌ ముగిసిన తర్వాత

అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు గెలుపు తమదంటే తమదే అని ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వంపైన వ్యతిరేకత లేదని, అదే సమయంలో పసుపు- కుంకుమ, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి నిధి వంటివి తమకు అనుకూలంగా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపైన నియోజకవర్గ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలలో శ్రీకాంత్‌రెడ్డిపైన ఉన్న వ్యతిరేకత వల్ల గతంలో కంటే తమకు ముస్లింలలో ఓటింగ్‌ శాతం పెరిగిందని టీడీపీ నాయకులు ఆశిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గం, టీడీపీ అభ్యర్థి రమే్‌షరెడ్డి వర్గాలు కలిసికట్టుగా పనిచేశాయి. కాంగ్రెస్‌, జనసేనల తరపున ముస్లిం మైనార్టీలు బరిలో నిలిచారు. వీళ్లు ఎంతో కొంత ముస్లిం ఓట్లను చీల్చి ఉంటారు. సాఽధారణంగా ఇవి వైసీపీకే పడే ఓట్లు. వీటన్నింటినీ గమనిస్తే మెజార్టీ ఇంతా అని చెప్పలేకపోయినా తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ గాలి బలంగా వీచిందని, జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో జనం ఉన్నారని, కాబట్టి తాము తప్పకుండా గెలుస్తామని వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, టీడీపీలోని రెండు వర్గాలు కలిసి కట్టుగా పనిచేయడం వల్ల గతంలో వచ్చిన మెజార్టీ రాకపోయినా.. భారీ మెజార్టీతోనే ఈసారి కూడా గెలుస్తామనే ధీమా వైసీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లే నట్లు.. అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడం కూడా ఇరుపార్టీలు తమకంటే.. తమకే లాభమని అంచనా వేస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 275 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరుపార్టీలకు చెందిన నాయకులు

పోలింగ్‌ కేంద్రాల వారీగా లెక్కలు వేయడంలో బిజీగా ఉన్నారని సమాచారం. పోలింగ్‌ కేంద్రాల వారీగా తమ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన చోటా నాయకులను పిలిపించి ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఆయా పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓటర్లలో కులాల వారీగా తమకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయో కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చాలా గ్రామాల్లో చోటా నాయకులు కాకి లెక్కలు చెబుతున్నాట్లు పలువురు పేర్కొంటున్నారు. ఓటర్లను పక్క పార్టీ కంటే.. బాగా చూసుకున్నాం.. కాబట్టి.. మొత్తం ఓట్లన్నీ తమకే పడి ఉంటాయని చోటా నాయకులు ముఖ్య నాయకులకు చెబుతున్నాట్లు సమాచారం. అయితే ముఖ్య నాయకులు వీటిని పూర్తి స్థాయిలో నమ్మలేక.. ఇతర మార్గాలలో సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గతంలో 2012, 2014 ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ వచ్చిన మెజార్టీ కారణంగా ఈ దఫా కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నాయి. ఇలా పందేలు కాయడంలో.. వైసీపీ కాలు దువ్వుతోందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌రెడ్డి విజయంతో పాటు జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. శ్రీకాంత్‌రెడ్డి 12 వేల నుంచి 15 వేలు ఓట్ల మెజార్టీ వస్తుందని వైసీపీ తరపున ఎక్కువగా పందేలు వస్తున్నాయి. వందకు రూ.70 లెక్కన పందేలకు సై అంటున్నారు. (అంటే.. శ్రీకాంత్‌రెడ్డి గెలిస్తే.. రూ.70 వేలు టీడీపీ వాళ్లు ఇవ్వాలి.. రమే్‌షరెడ్డి గెలిస్తే.. వైసీపీ వాళ్లు రూ. లక్ష ఇస్తారు) ఇంకా కొందరు వందకు రూ.50 లెక్కన కూడా పందేలు కాస్తున్నారు. ఇంకా కొందరు మెజార్టీతో సంబంధం లేకుండా.. కేవలం శ్రీకాంత్‌రెడ్డి గెలుస్తాడనే పందేలు కాస్తున్నారు. అదే సమయంలో జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని కూడా రాయచోటిలో పెద్ద ఎత్తున పందేలకు దిగుతున్నారు. కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. 110 సీట్లకు తగ్గకుండా వైసీపీకి వస్తాయని కొందరు.. సొంతంగా వైసీపీకి మెజార్టీ రాకపోయినా.. జనసేనను అయినా కలుపుకుని జగన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని ఇంకొందరు ఇలా జోరుగా పందేలు సాగుతున్నాయి. అయితే రాయచోటిలో