
గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికీ ఆ 25 మంది మంత్రులు ఎవరు..? మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కింది..? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడా లీకులు కాకుండా చూసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. శనివారం ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చెబుతున్నారు. రేపు ఉదయం 11.49 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో జగన్ కార్యాలయం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని మొత్తం ఎమ్మెల్యేలతో కలిసి ఒక సమావేశాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే.అదే విధంగా జగన్ కూడా తన క్యాబినెట్ లోని మొత్తం ఐదుగురు డిప్యూటీ సీఎం లు ఉన్నారని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.అదే విధంగా జగన్ తన క్యాబినెట్ లోని ఉండబోయే మొత్తం 25 మంది మంత్రుల జాబితాను కూడా విడుదల చేస్తారని తెలిపారు. కానీ జగన్ మాత్రం ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో రాజకీయ మరియు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ మరింత ఎక్కువయ్యింది.అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ క్యాబినెట్ లో ఉండబోయే మొత్తం 25 మంది పేర్లు బయటకు వచ్చేసాయి.అధికారికంగా కూడా విడుదల చెయ్యబోయే ప్రకటనలో కూడా వీరి పేర్లే ఉంటాయని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు వస్తున్నా సమాచారం ప్రకారం ఆ జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.
1) మేకపాటి గౌతమ్ రెడ్డి
2) అంజాద్ బాషా
3) అనిల్‌కుమార్ యాదవ్
4) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
5) గుమ్మనూరు జయరాం
6) నారాయణస్వామి
7) బొత్స సత్యనారాయణ
8) ధర్మాన కృష్ణదాస్
9) కొడాలి నాని
10) పాముల పుష్ప శ్రీవాణి
11) అవంతి శ్రీనివాస్
12) కురసాల కన్నబాబు
13) పినిపె విశ్వరూప్
14) పిల్లి సుభాష్‌చంద్రబోస్
15) వెల్లంపల్లి శ్రీనివాస్
16) పేర్ని నాని
17) బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
18) ఆళ్ల నాని
19) తానేటి వనిత
20) మేకతోటి సుచరిత
21) మోపిదేవి వెంకటరమణ
22) ఆళ్ల రామకృష్ణారెడ్డి
23) శంకర్‌నారాయణ
24) చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
25) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి