ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా రెండు రోజుల క్రితం జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ముందు నుంచి సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా రోజాకు మంత్రివర్గ స్థానంలో చోటు లభించలేదు. అయితే ఇప్పుడు మంత్రివర్గంలో చోటు లభించని నేతలకు రెండున్నరేళ్ల తర్వాత మరోసారి చేపట్టే కేబినెట్ విస్తరణలో అవకాశం ఇస్తామని సీఎం జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపిన మంత్రి మండలి నామినేటెడ్ కమిటీలపై కూడా

చర్చలు జరిపింది. అయితే ఏపీలో అన్ని నామినేటెడ్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. టీడీపీ హయాంలో నియమించిన కమిటీలన్నీ ఒక్క సంతకంతో రద్దు కానున్నాయి. బుధవారం నుంచి జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకుకావడం లేదా ఆ తర్వాత ఆర్డినెన్స్ తేవడం ద్వారా వీటన్నిటిని రద్ధు చేయాలని భావిస్తుంది. అయితే ఈ సారి మంత్రి పదవులు లభించని వారికి ఇప్పటికే కొంతమందికి విప్ పదవులను అందించారు సీఎం జగన్. అయితే నామినేటెడ్ పోస్టులకు టీడీపీ నేతలు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు మంత్రిపదవులు ఆశించి నిరాశ చెందిన పలువురు సీనియర్లకు, ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారట. అందులోనే భాగంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు వాసిరెడ్డి పద్మ మరికొంత మంది సీనియర్ నేతలు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పదవులకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చానీయాంశంగా మారింది.అయితే నామినేటెడ్ పోస్టులకు టీడీపీ నేతలు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు మంత్రిపదవులు ఆశించి నిరాశ చెందిన పలువురు సీనియర్లకు, ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారట. అందులోనే భాగంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు వాసిరెడ్డి పద్మ మరికొంత మంది సీనియర్ నేతలు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పదవులకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చానీయాంశంగా మారింది.