సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ చిత్రం ‘ఓ బేబీ’. దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, తేజ, అడివి శేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జులై 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు సమంత హిట్టు కొట్టడం ఖాయమంటున్నారు. 23 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ 70 ఏళ్ల బామ్మ యాటిట్యూడ్‌తో ఆమె నటించిన తీరు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో సమంత విశ్వరూపం చూపించడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. కామెడీ, ఎమోషన్‌తో కూడిన ఈ ఫాంటసీ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సమంత కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవాలి. గతంలో ఎక్కువగా కనపడని కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో కనపడుతుంది. బేబీ లాంటో చాలెంజింగ్ పాత్రలో ఆమె ఒదిగిపోయింది.

అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో నటించినటువంటి రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు మరియు రావు రమేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం సమకూర్చారు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అడవి శేష్ పాత్ర కనిపించేది తక్కువ సేపే అయినా మెప్పిస్తారు.

మరో ప్రధాన పాత్రలో నటించిన నాగశౌర్య కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.

ఈ కాన్సెప్ట్ ముందుగానే చాలా మందికి తెలిసినా వెండి తెరపై చూసినప్పుడు సరికొత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది.

యసులో పెద్దగా ఉన్న వారు యుక్త వయసులోకి మారితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ను దర్శకురాలు నందిని రెడ్డి చాలా చక్కగా బ్యాలన్స్ చేస్తూ తీసుకెళ్తారు.

ఆధ్యంతం వినోదభరితంగా మరియు ఆసక్తికరంగా మొదటి సగం సినిమా పూర్తవుతుంది.సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఎంటెర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాసరే అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది

క్లైమాక్స్ చాలా బావుంది.

మిగతా సాంకేతిక విభాగాల్లో కూడా బావుంది ఈ ఓహ్ బేబి.


ఓవరాల్ గా చుస్తే ఓ బేబీ సినిమా చూసే ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పాలి.ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే ఈ సినిమాలో కాన్సెప్ట్ మరియు సమంత నటన,క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవగా సంగీతం అక్కడక్కడా డ్రాగింగ్ సెకండాఫ్ మైనస్ పాయింట్లుగా నిలుస్తాయి. కుటుంబంతో హాపీగా చూసే చిత్రం ఓహ్ బేబి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.25/5