బాహుబలి అనే రెండు చిత్రాల తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ఒక్క దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో ప్రకంపనలు రేపుతూ భారీ ఎత్తున అదే స్థాయిలో విడుదల అవుతూ ఎన్నో రికార్డులను వేటాడేందుకు సిద్ధంగా ఉన్న చిత్రం సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నాలుగు భాషల్లో విడుదల అయ్యింది. రొమాంటిక్, సస్పెన్స్, భారతదేశంలోనే మొట్టమొదటి భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని సాహో మేకర్స్ తెలియజేసారు.ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు మా బుల్లెట్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

బాహుబలి తర్వాత వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని కాపాడటానికి ప్రభాస్ చెయ్యని ప్రయత్నం లేదు, కానీ లుక్స్ పరంగా అతని వేరియేషన్స్ బాలేదు

శ్రద్దా కపూర్ వల్ల సినిమాకు వచ్చిన లాభం కానీ, సినిమా వల్ల ఆమెకు వచ్చిన లాభం కానీ లేదు

హెవీ స్టార్ కాస్ట్ ఉన్న ఏ ఒక్కరికి మంచి రోల్ లేదు

ప్రభాస్ శ్రద్ధా కపూర్ మధ్యలో కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు

ఇంకా బావుంటుంది ఏమో ఇంకా బావుంటుంది ఏమో అని ఓపిక గా వేచి చూస్తూ ఉండగానే ఇంటర్వల్ వస్తుంది

సెకండ్ హాఫ్ ఓపికగా కూర్చోటం కష్టం

గమనం లేని కథ, అంత కంటే బాలేని స్క్రీన్ ప్లే, ఈ రెండింటిని మించి ఉన్న గ్రాఫిక్స్ అన్ని కలిపి ఈ సినిమాని చెడకొట్టాయి

హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, వాటి లీడ్ సీన్స్ పేలవంగా ఉంటాయి

పాటలు, వాటి పిక్చరైజేషన్‌ కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి.

కామెడీ కూడా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు.

ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంట మంచిది

దర్శకుడు ఈ సినిమాకి పెద్ద మైనస్,ఎదో చెప్పాలని ఆశించి ఏమి చెప్పలేక కంగాళీ చేసేసాడు.

ఓవరాల్ గా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఆసక్తికరంగా సాగలేదు. కొత్తదనం లేని కథ,కథనాలు, ఇంట్రస్ట్ లేని మరియు అనవసరమైన సన్నివేశాలు వల్ల సినిమా ఫలితం దెబ్బ తింది. ఇప్పటికే ఈ సినిమా పై నెలకొన్న భారీ అంచనాల వల్ల థియేటర్లకు జనాలు రావడం వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినా,మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద దెబ్బ తినే అవకాశాలే ఎక్కువ.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2/5