ప్రస్తుతం టాలీవుడ్‌లో వేగంగా సినిమాలు పూర్తిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది నేచురల్ స్టార్ నానీనే. సంవత్సరానికి కచ్చితంగా రెండు సినిమాలను నాని ప్రేక్షకులకు అందిస్తున్నారు. కిందటేడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఈ ఏడాది ఇప్పటికే జెర్సీ తో హిట్ కొట్టారు. ఇప్పుడు నానీస్ గ్యాంగ్ లీడర్ ను తీసుకొచ్చారు. జెర్సీ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ జర్నీ స్టార్ చేసిన నాని.. గ్యాంగ్ లీడర్తో బ్లాక బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. అంతేకాదు, థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తానంటున్నారు. నాని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారధిగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి(సీవీఎం) నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

నాని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారధి పాత్రలో ఒదిగిపోయాడు. తనకి మాత్రమే సాధ్యమైన పెర్ఫామార్మేన్స్ తో ఆకట్టుకున్నాడు.

మిగతా నటీనటుల పనితీరు బావుంది.

ముఖ్యంగా లక్ష్మి, శరణ్య పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.

నెగెటివ్ రోల్ లో కార్తికేయ ఆకట్టుకున్నాడు.

అనిరుద్ సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకుంటాయి

ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా ఉంటుంది

సినిమాటిక్ లిబర్టీస్ అందరికి రుచించకపోవచ్చు కానీ బావున్నాయి.

సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయినా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ లో ఆకట్టుకుంటుంది

స్టోరీ కొత్తగా ఉండటంతో పాటు, నేరేషన్ అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం గురించి చెప్పేది లేదు, దక్షిణాదిలో ఉన్న మంచి దర్శకుల్లో ఒకడు అనేది తెలిసిందే.

కెమెరా, ఎడిటింగ్ తో పాటు సాంకేతిక విభాగాలు ఆకట్టుకున్నాయి.

మొత్తంగా చుస్తే నానీస్ గ్యాంగ్ లీడర్ ఎంటర్తైనింగ్ గా బావుంది. కుటుంబ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకునే చిత్రం అవుతుంది. మీ కుటుంబంతో సరదాగా చూసే చిత్రం అవుతుంది.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.25/5