మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అనేక వివాదాల నడుమ ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గడ్డలకొండ గణేష్‌’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే టైటిల్‌తో సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. కానీ, సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు దిగడం.. ఆఖరి నిమిషంలో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చాల్సిరావడం బాధాకరం. అయినప్పటికీ ‘గద్దలకొండ గణేష్’కి వచ్చిన ఇబ్బందేమీ లేదు.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

వరుణ్ తేజ్ కి పూర్తి మాస్ హీరోగా దొరికిన తొలి అవకాశాన్ని బానే యాజ్ చేసుకున్నాడు. అక్కడక్కడా తడబడ్డా మొత్తంగా ఆకట్టుకున్నాడు.

వరుణ్ తేజ్ లుక్స్ పరంగా ఫుల్ మర్క్స్ కొట్టేస్తాడు.

అధర్వ మురళి తన తెలుగు డెబ్యూలో అక్కట్టుకున్నాడు. అతని ప్రియురాలుగా మృణాళిని రవి బావుంది.

షార్ట్ అండ్ స్వీట్ రోల్ లో పూజా హెగ్డే ఆకట్టుకుంది

ఈ సినిమాకి సంబంధించి మెయిన్ హైలెట్స్ లో ఒకటి మిక్కీ జె మేయర్ సంగీతం, ముఖ్యంగా నేపధ్య సంగీతం ప్రాణం పోసింది.

సినిమాటోగ్రఫీ బావుండి.

ఎడిటింగ్ మరింత క్రిస్పీ గా ఉండాల్సింది.

ఈ సీనిమా విజయంలో సింహ భాగం దర్శకుడు హరీష్ శంకర్ కి వెళ్తుంది. జిగర్తాండ అనే ఒక సక్సెస్ ఫుల్ కథలో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆకట్టుకునేలా చెప్పటంతో పాటు, డైలాగ్స్ లో కూడా పదును పెంచాడు.

మొత్తంగా చుస్తే వాల్మీకి చాలా కాలం తర్వాత వచ్చిన పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఈ వీకెండ్ చూడదగ్గ చిత్రం.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.25/5