మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అవ్వనుండటంతో మెగా సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్స్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, అమెరికా సహా భారతదేశంలో సైతం ప్రీమియర్స్ సందడి షురూ అవుతుంది. మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ను మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో పాటు.. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ ఉడ్‌లకు సంబంధించిన స్టార్లు.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గానది జయంతి సందర్భంగా నేడు విడుదల అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి నటించిన ఈ చిత్రంలో చిరంజీవి లుక్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చిరంజీవి వయసు అక్కడక్కడా కనిపించినా, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ మీద కాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది. కానీ తెర మీద చిరంజీవి తప్పితే వేరే ఎవరు కనపడరు.

తమన్నా,నయనతార తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.

అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తమకు ఇచ్చిన పాత్రల్లో సరిపోయారు.

అమిత్ త్రివేది సంగీతం ఒక మోస్తరుగా ఉంది, ముఖ్యంగా నేపధ్య సంగీతం అనుకున్న స్థాయిలో లేదనే చెప్పాలి.

టెక్నీకల్ విషయాల్లో మేజర్ స్కోర్ సాధించేది సినిమాటోగ్రఫీ.

ఎడిటింగ్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది, సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది.

రెండు యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి. కానీ ఎక్కువ శాతం యాక్షన్ కథ కోసం కాకుండా, ఫాన్స్ కోసం ఉండటమే సమస్య.

చారిత్రిక సినిమాల్లో హిస్టరీ నుంచి డీవియేషన్ అనేది ఉంటుంది, కానీ ఎక్కువగా తెలియని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి కథలు చెప్పేప్పుడు నిజాయితీ ఉంటె బావుంటుంది.

ఈ చిత్రంలో చరిత్ర వక్రీకరణ సినిమాటిక్ లిబర్టిగా చెప్పుకున్నా దాదాపు పన్నెండేళ్ల క్రితం రెడీ అయిన కథని వాస్తవాలకు దగ్గరగా ఉంచితే బావుండేది అనిపిస్తుంది.

270 కోట్లతో చిరంజీవి ఒక సినిమా అనగానే అంచనాలు ఎక్కువ ఉంటాయి కాని హీరో ఎలివేషన్ కోసం వాస్తవికత నుంచి దూరం జరిగారా అనిపిస్తుంది.

సురేందర్ రెడ్డి దర్శకుడుగా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదనిపిస్తుంది కానీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తడబాటు లేకుండా హాండిల్ చెయ్యగలిగినట్టే.


మొత్తంగా చుస్తే సైరా నరసింహ రెడ్డి పర్లేదు అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న మెగాభిమానులకు పర్లేదు అనిపించినా, మిగతా ప్రేక్షకులకు ఎంతవరకు రుచిస్తుంది అనేదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. వారం మధ్యలో రిలీజ్ కావటం ఒక సమస్య అయితే, పండగ సెలవుల్లో రావటం కలిసి వచ్చే అంశం కావొచ్చు. చూడాలి బాక్సాఫిస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5