రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఇటు దగ్గుబాటి అభిమానులతో పాటు అటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వెంకటేష్ చేసిన మరో మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు విపరీతమైన ప్రచారం కల్పించారు. తనకు ఇది మరో ‘మనం’ అంటూ నాగచైతన్య చెబుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘వెంకీమామ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ విక్టరీ వెంకటేష్, నాగ ఛైతన్యల మధ్య కేమిస్ట్రీ

ఈ చిత్రాన్నీ వెంకటేష్ తన అనుభవంతో క్యారీ చెయ్యగా,నాగ చైతన్య తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు

రాశి ఖన్నా, పాయల్ రాజపుట్ తమ పరిధుల మేరకు ఆకట్టుకున్నారు.

తమన్ సంగీతం సో సో గా ఉంది

ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది

తోలి సగం బావుంది, రెండో సగం పర్వాలేదనిపిస్తుంది

దర్శకుడు బాబీ మంచి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు.

మొత్తంగా చుస్తే వెంకటేష్ నాగ చైతన్యలను ప్రేమమ్ లో కొద్ది నిమిషాలు చూస్తే బావుంది అనిపించినవాళ్ళు సినిమా మొత్తం ఇద్దరూ కనిపిస్తుంటే కనులపండగగా ఉంటుంది. అక్కినేని,దగ్గుబాటి అభిమానులు ఎంజాయ్ చెయ్యగలరు.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5