కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజైంది. దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారు? రజనీ మ్యాజిక్ చేశారా అని తెలుసుకోవాలంటే మా బుల్లెట్ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.


రజని కాంత్ వన్ మాన్ షో, ఆ ఏజ్ లో ఆ ఎనర్జీ అసాధారణం. రజని కాంత్ బలం మీద ఎక్కువ ఆధార పడ్డాడు దర్శకుడు.

రజని కాంత్ కి ఆయన కూతురు కి మధ్య ఉన్న సన్నివేశాలు బలం గా ఉన్నాయి

అనిరుద్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం గా ఉంది

ఎడిటింగ్ మరింత క్రిస్పీ గా ఉండాల్సింది

చాలా కాలం తర్వాత మురుగదాస్ ట్రేడ్ మార్క్ స్టైల్ అందుకున్నాడు

మెట్రో స్టేషన్ ఫైట్ మేజర్ హైలెట్

ఓవరాల్ గా చూస్తే దర్బార్ రజని కాంత్ ఫాన్స్ పండగ లాంటి సినిమా. వింటేజ్ రజని ఈజ్ బాక్

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3/5