ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్‌ ఇచ్చింది. పంచాయితీ కార్యాయాల‌కు రంగులు వేస్తూ ప్రభుత్వం విడుదల‌ చేసిన జీవో 623ను రద్దు చేసింది. ప్రభుత్వ కార్యాయాల‌కు రంగుల‌ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా మళ్లీ జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భవనాల‌కు వైకాపా పార్టీ రంగులు వేస్తున్నారంటూ గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదల‌ను విన్న హైకోర్టు పంచాయితీ కార్యాయాల‌కు వైకాపా పార్టీ రంగులు తొల‌గించాని, ఎటువంటి రంగులు వేయాల‌నే దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి వేసిన రంగులు తొల‌గించి కొత్త రంగులు వేయాల‌ని సూచించింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించడంతో

నూతనంగా 623జీవోను ప్రభుత్వం విడుదల‌ చేసింది. దీని ప్రకారం నాలుగు రంగుల‌తో మళ్లీ ప్రభుత్వ భవానాల‌కు రంగు వేసింది. అయితే దీనిపై మరోసారి గుంటూరుకు చెందిన చింతపాటి సోమయాజులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. తాము చెప్పినా మళ్లీ అవే రంగులు ఎలా వేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాము వేసిన రంగులు వైకాపా పార్టీకి చెందినవి కాదని ప్రభుత్వం వాదించగా హైకోర్టు వారి వాదను తిరస్కరిస్తూ ఈ రోజు 623 జీవోను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా పంచాయితీ కార్యాయాల‌కు రంగులు వేయ‌డానికి మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాల‌ని రాష్ట్ర పంచాయితీరాజ్‌ కార్యదర్శితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాల‌ని రిజిస్ట్రార్‌ను కోర్టు ఆదేశించింది. ఈ నెల‌ 28 లోపు రంగుల‌కు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాల‌ని లేని పక్షంలో 28లోపు కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు చెప్పిందని 623జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల‌ వ్యాజ్యం వేసిన చింతల‌పాటి సోమయాజు తెలిపారు.