టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అలా వైకుంఠపురం చిత్రం కోసం మళ్లీ ఈ జోడి చేతులు కలిపింది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ కాస్త టైం తీసుకుని వచ్చిన చిత్రం అలా వైకుంఠపురంలో

అల్లు అర్జున్ వన్ మాన్ షో, లుక్స్,నటన,యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడు

సుశాంత్ ఆకట్టుకున్నాడు, పూజా హెగ్డే బానే చేసింది

టబు,సచిన్,సముద్రఖని సహా మిగతా నటులు బాగా చేసారు

బ్లాక్ బస్టర్ సంగీతం ఇచ్చిన తమన్,నేపధ్య సంగీతంలో కూడా ఆకట్టుకున్నాడు

సాంకేతికంగా అన్ని విభాగాల్లో బావుంది

తొలి సగం బావున్నా, సెకండ్ హాఫ్ స్లో అయ్యింది, రొటీన్ సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టిస్తుంది

త్రివిక్రం తన మార్క్ చాలా కాలం తర్వాత చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ లో గమనం తప్పింది

మొత్తంగా చుస్తే అలా వైకుంఠపురంలో పండగ సీజన్ లో కుటుంబంతో చూసే సినిమా, బలహీనమైన సెకండ్ హాఫ్ భరించగలిగితే.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.5/5