కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో చాలాసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులిచ్చాయని, అప్పుడు చంద్రబాబు రాజీనామా చేయలేదని, ఇప్పుడూ ఆ అవసరం లేదన్నారు. ప్రభుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసునని, రాజ్యాంగానికి లోబడి అన్ని వ్యవస్థలు పనిచేయాల‌ని ఆయన పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా తిరిగి నియమించాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాయంలో మీడియాతో మాట్లాడుతూ నెల‌ రోజు క్రితం రాష్ట్ర ఎన్నికల‌ కమీషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయగా ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో జస్టిస్‌ కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. దీనిపై టిడిపి, బిజెపి నేతలు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై నెల‌ రోజులుగా విచారణ జరగగా ఈ రోజు హైకోర్టు తన తీర్పును మెవరించింది. ప్రస్తుతం తమకు న్యాయం జరగలేదని, దీనిపై పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, దీనిపై న్యాయనిపుణుల‌తో చర్చిస్తున్నామని అంబటి తెలిపారు.