ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇతర రాష్ట్రాల నుండి రాకపోకల విషయంలో పోలీస్ వ్యవస్థ ఇంకా కఠినంగా నే వ్యవహరిస్తుంది. అయితే నిన్న వైజాగ్ పర్యటనకు సంబంధించి అనుమతి తీసుకున్న చంద్రబాబు నేడు మాత్రం విశాఖపట్నం వెళ్ళలేదు. దాదాపు 65 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకున్నారు. అది కూడా రోడ్డు మార్గం ద్వారా. చివరిసారిగా వైజాగ్ వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబు కి చెడు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాగా నేడు పలు విమాన సర్వీసులు రద్దు కావడం వలన చంద్రబాబు నాయుడు వైజాగ్ కు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అయితే వైజాగ్ లో చంద్రబాబు నాయుడు అక్కడి ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ నుండి విష వాయువు వెలువడిన కారణంగా కొందరు మృత్యు వాత పడగా, మరికొంత మంది అనారోగ్యం పాలయ్యారు. అయితే వారిని పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళవలసి ఉంది. కానీ విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఇందుకోసం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అనుమతి అడగగా, ప్రత్యేక కేస్ కింద అనుమతి ఇచ్చారు.