డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఆ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ ఈ రోజు నాంపల్లి కోర్ట్ కి హాజరు అయ్యాడు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణ లో తన కార్ కి డ్రైవర్ ఉండే వాడని, ఐతే దురదృష్టవశాత్తు ఆ రోజు అతను రాలేదని,దానివల్లనే తానూ కార్ నడిపినట్టు గా ఒప్పుకున్నాడు. అంతే కాకుండా ఇక ముందెప్పుడూ ఇలాంటి పొరపాటు చెయ్యనని కోర్ట్ కి విన్నవించుకున్నాడు. ప్రదీప్ వాదనలు విన్న కోర్ట్ అతనికి శిక్ష ఖరారు చేసి  చట్టం ముందు అందరు సమానమే అని నిరూపించింది.

 

డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ  ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది, అంతే కాకుండా రూ.2100 జరిమానా విధించింది. బ్రీత్ ఎనలైజర్‌లో 178  పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్ కారును పోలీసులు అక్కడికక్కడే సీజ్ చేశారు.  ఆ తర్వాత కొన్ని రోజులు అదృశ్యమైన ప్రదీప్ పరారి లో ఉన్నట్టు వార్తలు కూడా హల్చల్ చేసాయ్. ఎక్కడికెళ్లిపోయాడా అని చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఓ వీడియోను విడుదల చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటానని, చట్టానికి పూర్తీ గా సహకరిస్తా అని స్పష్టం చేశాడు. తర్వాతా గోషామహల్ లో తండ్రితో కలిసి పోలీస్ కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. ఇవాళ కోర్టుకు కూడా తండ్రితోనే కలిసి వెళ్లాడు. మారిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అతనికి జైలు శిక్ష తప్పక పడుతుందనే వాదన వినిపించినా, ప్రదీప్‌కు ఈ కేసు లో కొంత ఊరట లభించిందనే చెప్పాలి.