బాబు గోగినేని అనే పేరు కి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు.గతం లో అడపా దడపా టివి చానల్స్ లో కనిపించిన ఆయన దోశలు వేసే డాక్టర్ ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి జనాలని మోసం చెసినప్పుదుఅతను తప్పు అని ప్రూవ్ చేసి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు. తర్వాత దొంగ స్వామీ వేణు స్వామి ని ఎక్స్పోజ్ చేసారు. సరే మన వేలం వెర్రో చానల్స్ కి లాస్ట్ రెండు నెలల్లో కుదిరితే కత్తి మహేష్ లేకపోతే బాబు గోగినేని పానల్ గెస్ట్స్ అయ్యేవారు. కోడి పందాల నుంచి దొంగ స్వామి దాక టాపిక్ ఏదైనా బాబు గోగినేని తప్పక ఉండేవారు. కాస్త పాపులారిటి వచ్చాక దానిని హండిల చెయ్యటం లో తడబాటు సహజం, దాని తోడూ అందరు అపర మేధావి అంటుంటే ఆయనకి ఎలా ఉందొ కాని, పాయింట్ మీద డిస్కషన్ చేసే ఆయన డిబేట్ బావుండేవి. కాని ఆయన గత వారం ఒక టివి చానల్ ఒక కులం మీద ఏడవటానికి పెట్టిన డిస్కషన్ ఒక చెత్త. అనవసరం కుడా, కుల అశాంతిని లేపటానికి పెట్టిన చిచ్చు అని అందరికి తెలిసిందే. ఆ డిబేట్ కి ఈయన వచ్చారు, రైట్ పర్సన్ ఎట్ రాంగ్ ప్లేస్ లా అనిపించింది. అది పక్కన పెడితే హేతువాది, నాస్తికుడు అయిన బాబు గోగినేని గతంలో “గ్రహణం వర్రీ” అనే ఒక డిస్కషన్ కి వెళ్ళారు. అక్కడ ఆయనకీ సరైన పానలిస్ట్ తగిలారు….

బంగారయ్య శర్మ అనే ఒక వ్యక్తీ బాబు గోగినేని ని కార్నర్ చేసారు. దేవుడు లేదు అనే బాబు గోగినేని, రసాయన ప్రక్రియ వాళ్ళ జీవం పుట్టింది అన్నారు అని చెప్తూ…”కెమికల్స్ అన్ని కలిసి జీవం పుట్టుకొచ్చింది, ఆ జీవం రకరకాలు గా చేంజ్ అవుతూ  పెరిగింది అనేది బాబు గారు చెప్పిన కాన్సెప్ట్.మీరు ఏదైనా ఒక బాక్టీరియా కాని ఫంగస్ కాని తీసుకోండి, అందులో ఉండే జీన్స్,ప్రోటీన్స్,లిపిడ్స్,మాలిక్యూల్స్ అన్ని చూపెట్టే పరికరాలు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి.ఈ రసాయనాలు ఎంత క్వాంటిటి లో ఉన్నాయో కూడా చెప్తాం. ఆ రసాయనాలన్ని ఆయనకీ విడివిడి గా ఇస్తాము, ప్రపంచం లో ఆ సైంటిస్ట్ తో ఆయన జీవం పుట్టించగలరా?” అని సూటి ప్రశ్న వేసారు. మీరు ఏ ప్రాణి ని చెప్పిన అందులో ఉన్న జీన్స్,ప్రోటీన్స్,లిపిడ్స్,మాలిక్యూల్స్ అన్ని ఇస్తాను, జీవాన్ని పుట్టించమనండి అని చాలెంజ్ చేసారు. దానికి బాబు గోగినేని నుంచి సమాధానం ఏమి రాలేదు.ఆయన వాదనకి హేతుబద్దత ఉంటె జీవాన్ని పుట్టించమనండి అని ప్రశ్నించారు.బాబు గోగినేని హిందూ మతం మీద దాడి చేస్తున్నారని ఒక వర్గం ప్రచారం చేస్తున్న నేపధ్యం లో ఈ వీడియో బయటకి రావటం గమనార్హం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది….మీరు కూడా ఒక లుక్కెయ్యండి.