గత కొంత కాలంగా దేశంలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ భారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోగా, ఇప్పటికి కొన్ని లక్షల మందిలో ఈ వైరస్ కి సంబందించిన పాజిటివ్ లక్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని వైద్యారోగ్య శాఖా అధికారులు వెల్లడించారు. కాగా ఈ వైరస్ భారిన పడ్డవారందరిని ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా తమవంతుగా తమకు తోచిన సాయాన్ని అందించారు. కాగా తాజాగా ప్రముఖ సినీనటుడు, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బాధితులకు తనవంతు సాయం అందించారు. కాగా హిందూపురం పట్టణంలో కరోనా వైరస్ నివారణకై ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణలో ఉండాలని, ప్రజలు తీసుకునే కఠినమైన చర్యల వల్లే ఈ వైరస్ నివారణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బాలకృష్ణ వాఖ్యానించారు. కాగా హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం రూ.25 లక్షల విలువైన రెండు వెంటి లేటర్లు, కోవిడ్ ఆసుపత్రి లో పనిచేస్తున్న డాక్టర్లకు బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ట్రస్ట్ తరఫున 100 పిపిఈ కిట్లు సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు. గతంలోనూ చాలా రకాల పరికరాలు, ప్రత్యేకమైన కిట్లు అందించామని చెప్పిన బాలకృష్ణ, భవిష్యత్తులో కూడా మరిన్ని అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు.