ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతి, సంక్రాంతి మొదలేయ్యేది భోగితో. భోగి మంటలు మన దగ్గరే బాగా తగ్గిపోయాయి. భోగి ఏంటిలెండి, హరిదాసు ని గంగిరెద్దు ని లాస్ట్ టైమ్ ఎప్పుడు చూసాము, ఇంకా మనం సంక్రాంతి పండగ ఇంట్లో కంటే రోడ్ మీద ఎక్కువ చేసుకుంటాము. భోగి మంటలు రోడ్ మీదనే, సందు ఈ చివర నుంచి ఆ చివరికి ఉండే రధం ముగ్గులు రోడ్ మీదనే, రంగవల్లులు రోడ్ మీదనే, వాటి మీద గొబ్బెమ్మలు రోడ్ మీదనే. కాని ఎక్కడో అమెరికా వెళ్ళినా మన సంస్కృతి ని పాటించాలి, అలా అని రోడ్ మీద భోగి మంటలు వెయ్యగలరా? అక్కడ రూల్స్ ఒప్పుకోవుగా, అలా అని అక్కడ రోడ్లు మీద రధం ముగ్గు వెయ్యగలమా లేదే…అలా అని సైలెంట్ గా ఇంట్లో పడుకుంటారా? అంటే లేదు…. ఆంధ్రులు కాంప్రమైజ్ అవ్వరు, మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఆంధ్రుడి టాగ్ లైన్ కదా మరి. బాక్ యార్డ్ లో  భోగి మంటలు సెట్ అప్ చేసుకుని సంతోషంగా సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టుకున్నారు.

మయామి,ఫ్లోరిడాలో ఉంటూ బర్గర్ కింగ్ కార్పోరేషన్(RBI డివిజన్) లో పని చేస్తున్న తెలుగువారు ఈ బుజ్జి భోగి మంటల సెటప్ తో సంబరాలు మొదలు పెట్టారు.


Wish You all a very Happy Sankranthi.

-ఆంధ్రుడు