2019 ఎన్నికల్లో ఊహించని విధంగా రాజకీయ పార్టీల ఫలితాలు వచ్చాయి. వైసీపీ, టిడిపి జన సేన పార్టీలు తమ తమ మేనిఫెస్టో లను ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఎన్నికల ముందు జన సేన పార్టీ నేతలు వైసీపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జేడీ లక్ష్మీనారాయణ సైతం వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అది గతం.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పలు హామీలను నెరవేరుస్తూ ప్రజా పాలన లో దూసుకు పోతున్నారు. అయినప్పటికీ వైసీపీ పై, జగన్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇటీవల జన సేన పార్టీ నుండి బయటకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరొకసారి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది రాజకీయ నాయకులు,పార్టీలు, మానిఫెస్టో లో పెట్టిన విషయాలు చేయరు అను అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మానిఫెస్టో లో ప్రకటించిన హామీలను అమలు చేస్తుంది అని వ్యాఖ్యానించారు. జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా వస్తున్న సిబిఐలోకి జెడి లక్ష్మి నారాయణ అన్న వార్తలకి బలం చేకూరింది. కొందరు వైకాపా నేతలు సైతం సిబిఐ జెడి వైకాపాలోకి రావటం లాంఛనమేనని, లాక్ డౌన్ పూర్తయ్యక చేరిక లాంఛనంగా ఉంటుందని భావిస్తున్నారు.