ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జల వివాదాలు కొత్తేమీ కాదు, అయితే తాజాగా పోతిరెడ్డపాడు ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీఓ 203 ను జారీ చేసింది. అయితే దీని పై మొదటగా తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే సముద్రం లోకి వృధాగా పోయె జలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్పేమీ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు.అయితే ఈ వివాదం మాత్రమే కాకుండా, జల వివాదాల పై ఇరు రాష్ట్రాల కు సంబంధించి ఒక కౌన్సిల్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ జల వివాదాల పై అపెక్స్ సమావేశం త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు, మరియు గోదావరి, కృష్ణా జలాల యాజమాన్య బోర్డులకు ఈ సమాచారం చెరవేసింది. అయితే సీఎం లు కూడా ఈ కౌన్సిల్ లో సభ్యులుగా వ్యవహరించే అవకాశం ఉంది. వీరితో పాటుగా నీటి పారుదల శాఖ మంత్రులు, మరియు కృష్ణ, గోదావరి నది యాజమాన్య బోర్డులకు సంబంధించిన వారిని ఇందులోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశం కోసం వీరు తమ అంశాల్ని పంపించాల్సి ఉంటుంది. త్వరలో వీటి పై ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది.