chandra-babu-balanced-reaction

ప్రత్యేకరాష్ట్రం గా తమిళనాడు నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక కూడా తెలుగు వారిని ఉత్తర భారత దేశం లో మదరాసీలు అనేవారు.

ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అలానే అంటున్నారు. అలాంటి తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారి ఆత్మ గౌరవమే నినాదం గా తర్వాతి కాలం లో తెలుగు దేశం పార్టిని కుడా స్థాపించారు. ఆ తర్వాతి కాలం లో తెలుగు వారికి, తెలుగు జాతికి ప్రపంచ పటంలో స్థానం కలిపించింది నిస్సందేహం గా చంద్ర బాబు నాయుడు గారే, ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇదంతా గతం, ఇక ప్రస్తుతం జరుగుతున్నది చూద్దాం

chandra babu andhrudu
chandra babu andhrudu

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మాహా సభల ప్రారంభ ఏర్పాట్ల నుంచి చుస్తే వీలు అయినంత వరకు ఆంధ్రా ప్రాంత నాయకులను, కవులను విస్మరించి తెలుగు అంటే తెలంగాణా వారి సొత్తు అని చెప్పటానికి విపరీతం గా తాపత్రయ పడుతున్నారు. తెలుగు మహా సభలలో ఎన్ టి ఆర్ ప్రస్తావన లేకపోవటం తప్పే అని తె రా స నాయకులే అభిప్రాయపడుతున్నారు. ప్రాంతాలు గా విడిపోదాం, తెలుగు వారిగా కలిసుందాం అని ఉద్యమ నేపద్యంలో ఏంటో మంది నాయకులు గొంతు చించుకుని చెప్పారు.  ఒకానొక సందర్భం లో అప్పటి ప్రత్యెక తెలంగాణా ఉద్యమ నాయకుడు, నేటి తెలంగాణా తోలి ముక్య మంత్రి కె సి ఆర్, ఎవునికి తెలుగు తల్లి? ఎక్కడ తెలుగు తల్లి? అన్నారు. అలాంటి నేత నేడు దగ్గర ఉంది ప్రపంచ తెలుగు మహా సభలు జరిపించటం మంచిదే, కాని సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి ఇన్విటేషన్ లేదు.

telugu maha sabhalu 2017
telugu maha sabhalu 2017

ఈ విషయం మీదనే ఒక మీడియా ప్రతినిది మిమ్మల్ని ఇన్వైట్ చెయ్యకపోవటం కరెక్ట్ కాదు సార అన్నాడట. దానికి చంద్ర బాబు ” పర్లేదమ్మ, అవన్నీ పట్టించుకోకూడదు. తెలుగు వారు ఎక్కడ ఉన్న బావుండాలి, అభివృద్ధి చెందాలి. ఇవన్ని చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు” అని వాఖ్యానించి నవ్వుతూ వెళ్లిపోయారట. ఆ సమాధానం విన్న మీడియా మిత్రులు ఇంట్లో చిన్న కొడుక్కి బాద్యత ఉండదు, ఏం పట్టించుకోడు, పెద్ద కొడుకు మాత్రం బాద్యత గా ఉంటూ, ఇంట్లో సమస్యలు లేకుండా చూస్తూ ఉంటాడు కదా, ఇది కుడా అలానే. ఏది ఏమైనా చంద్ర బాబు మనిషే వేరబ్బా అనుకున్నారట.

KCR-invited-for-amaravthi-foundation-stone
KCR-invited-for-amaravthi-foundation-stone

చిన్న కొసమెరుపు ఏమిటంటే పెద్ద కొడుకు తన రాష్ట్రంలో అమరావతి శంఖుస్థాపన కి కె సి ఆర్ ని ఇన్వైట్ చెయ్యటం, ఆయన రావటం కూడా జరిగాయి. అలానే మొన్నా మధ్య పరిటాల శ్రీరాం వివాహానికి కూడా హాజరు అయ్యారు. కాని చిన్న కొడుకు కదా, ఆత్మన్యూనత వల్ల ఏమో, లేదా పెద్దాయన వస్తే తనని ఎవరు పట్టించుకోరు అని క్లారిటి ఉండటం వల్లనో పిలవలేదు. చంద్ర బాబు మాత్రం వాళ్ళ ఇరుకు మనస్తత్వాలని పట్టించుకోవద్దు అని హుందాగా స్పందించారు.