టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్‌లో తన నివాసం నుంచి అమరావతికి బయల్దేరనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సుమారు 65 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయిన ఆయన ఇవాళ ఏపీ వెళ్తున్నారు. ఏపీకి విమానాల రాకపోకలు ఇవాళ లేకపోవడంతో రోడ్డు మార్గానే ఆయన వెళ్లనున్నారు.

మొదట విజయవాడ మీదుగా అమరావతికి వెళ్తున్నారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు అనుమతి లేకపోవడంతో రోడ్డు మార్గానే వెళ్తున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఉన్నారు. నేడు గన్నవరం ఎయిర్‌‌పోర్టుకు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం నుంచి డొమెస్టిక్ వాహనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకుని ఎల్జీ పాలిమార్స్ ఘటన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం వరకూ విశాఖలోనే చంద్రబాబు గడపనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. కాగా.. విశాఖ పర్యటన అనంతరం బాబు మీడియాతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం విదితమే.