టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఆయన హైదరాబాద్‌ నుంచి ఏపీకి రావడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల డీజీపీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపారు. ఈ నెల 25న ఉదయం 10:35గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తారు. గ్యాస్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన తర్వాత రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజునే, చంద్రబాబు కేంద్రాన్ని అనుమతి కోరారు. అయితే అప్పట్లో, లాక్ డౌన్ ఉదృతంగా ఉండటంతో, అనుమతి రాలేదు.

ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు కేంద్రం, రాష్ట్రాలకు అధికారం ఇవ్వటంతో చంద్రబాబు, రాష్ట్రాలకు పర్మిషన్ ఇవ్వమని కోరారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారు అంటూ వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్నా, చంద్రబాబు కరోనా పై, ఎప్పటికప్పుడు, ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపి వారిని ఆదుకోవటంలో చొరవ చూపించారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్తూ వచ్చారు. అలాగే ఒక ఫోరం ఏర్పాటు చేసి, కేంద్రానికి కరోనా పై, అలాగే దేశ ఆర్ధిక పరిస్థితి పై కేంద్రానికి సలహాలు పంపించటం, కేంద్రం వాటిని ప్రశంసిస్తూ, లేఖ రాసిన విషయం తెలిసిందే.