టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ రాణా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అన్న వార్త సంచలనం రేకెత్తించింది. నేడు రేపు అని ఎప్పటి నుంచి ఊరిస్తున్న రోజు రానే వచ్చింది. లీడర్ తో డెబ్యూ చేసిన దగ్గుబాటి వారసుడు, ఇటీవలే తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్నట్టు వార్తలు వచ్చాయి. బాహుబలి లో భల్లాలదేవ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందిన ఈ యువ నటుడు టివి హోస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎట్టకేలకు ఈ కండల వీరుడి మనసుని మిహిక బజాజ్ అనే హైదరాబాద్ బేస్డ్ డిజైనర్ దోచుకుంది. Dew Drop Designer Stuido అధినేత ఐన మిహీక తో ఉన్న ఫోటోను రాణా And She Said Yes… అనే కాప్షన్ తో తన ఇంస్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. చాలా మందో సెలెబ్రిటీలు, రాణా అభిమానులు తమ శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. ఆమె హైదరాబాద్ ఎట్ హార్ట్, ప్రస్తుతం ముంబై మరియు హైదరాబాద్ మధ్య షటిల్ చేస్తూ ఆమె కలలను వెంటాడుతోంది. మిహీకా ఇటీవలే ఈవెంట్ మరియు అలంకరణ స్థలంలోకి ప్రవేశించింది మరియు భవిష్యత్తు కోసం చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులను సైతం కలిగి ఉంది.

మిహీకా బజాజ్ గురించి మరిన్ని వివరాలు