సంక్రాంతి ని కోడి పందేలని విడివిడి గా చూడలేము. ప్రతి సంక్రాంతి కి కోడి కి కత్తి కట్టి వేసే ఈ పందేలలో కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. ఈ సంవత్సరం పందెం రాయుళ్ళే పైచెయ్యి సాధించారు. కత్తి కట్టొద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కత్తి కట్టి పందెం లోకి దిగారు. పందాలు బాగా ఆడే గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున బెట్టింగ్లు నడుస్తుంటే రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో కోడికి కత్తి కట్టి కోట్లు సంపాదించేస్తున్నారు.ఇక పోలీసులు కోర్ట్ ఆదేశాల మేరకు బాగా హడావిడి చేస్తున్నా రాజకీయ వత్తిడులు కారణంగా పెద్ద బరుల  జోలికి పోకుండా చిన్నా చితకా బరుల్లో ఆడుకునే వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నారట.ఐతే ఈ కోడి పందేలలో ఎన్ని వేల కోట్లు చేతులు మారతాయో తెలుసా….

ఈ కోడి పందాలలో 50 లక్షల బరి, 25 లక్షల బరి,10 లక్షల బరి, లక్ష రూపాయిల బరి ఇలా పందెం ఆడే ఏరియా ని బట్టి ఉన్న బరులు వేస్తారు. తిండి,నీరు అన్ని ఉచితమే. కొన్ని చోట్ల నిరంతరం మద్యం కూడా లభిస్తుంది. రెస్ట్ రూమ్స్, ఫ్లడ్ లైట్స్,LED స్క్రీన్స్ ఇలా పెద్ద స్థాయి 24/7 పందేలు జరుగుతాయ్. మీడియా కి ప్రవేశం లేదు,ప్రతి వాహనం చెక్ చేసి పంపుతారు ఇలా అంతా పకడ్బంది గా జరుగుతాయి. సినీ ఇండస్ట్రీ ప్రమఖులు ఐతే లెక్కే లేదు. భీమవరం,రాజమండ్రి,ఏలూరు,దేన్దలూరు ఇలాంటి చోటల్ హోటల్స్ లాడ్జీలు అన్ని ఫుల్లు. ఈ మూడు రోజుల పందేలలో షుమారు రెండు వేల కోట్లు బరిలో మారే పందెం డబ్బు అని తెలుస్తుంది. ఈ అమౌంట్ ఇంకా పెరగచ్చు కాని తగ్గేది ఐతే లేదు.తుని, కాకినాడ రూరల్,  మురమళ్ళ, పాలకొల్లు, భీమవరం, నరసాపురం,ఏలూరు ప్రాంతాల్లో పందెం రాయుళ్ళకు పగ్గాలు వేసే ధైర్యం చెయ్యరు ఎవరు. పందెం ఆగినా, బరి మూసేసినా ఆ పందెం నడిపించే వ్యక్తి ని అసమర్ధుడి కింద లేక్కేస్తారు. పందేనికి పర్మిషన్ తేలేదని ప్రజా ప్రతినిధులని ఓడించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అక్కడ పందెం పెట్టించటం అంటే ప్రజా ప్రతినిధులకి అంత ప్రిస్టేజ్ ఇష్యూ.