డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని… దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. గత శనివారం డాక్టర్ సుధాకర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సుధాకర్ మానసిక స్థతి సరిగ్గా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. శుక్రవారం విచారణ జరిపి తాజా ఆదేశాలు జారీ చేసింది. గత శనివారం డాక్టర్ సుధాకర్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది. అలాగే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కాగా తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, తెలుగుమహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖని సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం