chandra babu naidu is working hard for Andhra
chandra babu naidu is working hard for Andhra

చంద్ర బాబు నాయుడు – ఈ పేరు వినగానే ఇస్త్రీ చేసిన లేత గోధుమ రంగు పాంట్ షార్ట్ నల్లని హాఫ్ బూట్లు వేసుకుని ఎప్పుడూ ఎదో ఆలోచిస్తూ ఉండే ఒక మనిషి గుర్తుకు వస్తారు.

ఎప్పుడు ఎదో చేద్దాం అనే తపన,తాపత్రయం తప్పితే అనవసరపు విమర్శలు ఉండవు. తన రాజకీయ అనుభవం అంత వయసు లేని ఒక పిల్లోడు ప్రతిపక్షం లో అభివృద్ధి ని అడ్డుకునే జిత్తులు వేస్తుంటే అతన్ని పట్టించుకోకుండా, అతని స్థాయి కి అతను అంతే చేస్తాడు లే అని సర్ది చెప్పుకుంటు ముందుకు సాగటం ఎంత మందికి సాధ్యం?

మొన్నటికి మొన్న ఒక టి వి ఛానల్ డిబేట్ లో ఒక మోస్తరు స్థాయి కలిగిన ఇద్దరు వ్యక్తులు ఎంత చిల్లర గా మాట్లాడారో మనం చూసాం.అధికారం ఉందనే అహంతో సి ఏం స్థాయి లో ఉన్న వ్యక్తి ఏమన్నా మాట్లాడోచ్చు. కాని ఈ మనిషి అలా నోరు జారింది కనపడదు. రాష్ట్రానికి ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది తప్పితే పెద్ద కోరికలు ఆలోచనలు కూడా ఉండవు. అలా ఉండటం ఎంత మందికి సాధ్యం?

chandra babu andhrudu
chandra babu andhrudu

ఒక పక్క ముప్పేట విమర్సల దాడిని తట్టుకుంటూ, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో పరిగేత్తించటం అంట సులువేమీ కాదు. ఈ మనిషి కి అలుపు రాదా? నిద్ర ఆకలి గుర్తు రావా? అసలు ఈయన మనలాంటి మామూలు మనిషేనా? మీ లాంటి నాయకులకి సలాం చేస్తున్నాడు ఈ ఆంధ్రుడు.