బాబు గోగినేని ఈ మధ్య కాలం లో బాగా పాయూలర్ అయినా హేతువాది, టెంపర్ లూజ్ కాకుండా ఆయన చెప్పే సమాధానాలకు, లాజిక్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన బిగ్ బాస్ 2 లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అలా ఎంట్రీ ఇవ్వటంతో వందల సంఖ్యలో మేమెస్ వచ్చేసాయి. ఆయన బిగ్ బాస్ టాస్క్ చేస్తే ఎలా ఉంటుంది, బిగ్ బాస్ తో వాదిస్తే ఎలా ఉంటుంది అని రకరకాల పోస్ట్స్ వచ్చాయి. ఒక సోషల్ మీడియా యూజర్ “సిద్దార్ధ గౌతమ్” రాసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మీరు చదివి ఎంజాయ్ చెయ్యండి.

బాబు గోగినేని గారిని బిగ్‌బాస్ గదిలోకి పిలిచారు. ఆయన వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు.

బిగ్‌బాస్ – “బాబు గారు………….మీ మీద…………ఒక కంప్లైంట్……….వచ్చింది.”

– బాబు గోగినేని – “I thought so big boss. జరిగింది చెబుతాను. ఆవిడెవరో నాకు కాఫీ ఇచ్చారు. నేను సిప్ చేసాను. It was ok. But, అది ఏ విధంగానూ cutting-edge కాఫీ కాదు. అదే విషయం ఆవిడతో అన్నాను. నన్ను ఈ గదిలోకి పిలిచినంత మాత్రాన నాకున్న హక్కులు మాయమైపోవు.

ఆవిడని పిలవనంతమాత్రాన ప్రత్యేక హక్కులు రావు. If we can comprehend and appreciate that, అందరికీ మంచిది. ఆవిడకు ginger tea అంటే ఇష్టమని ఇందాక ఎవరో చెప్పారు. I respect that. But, కనిపించిన ప్రతి liquid లోనూ అల్లం కలిపేసే హక్కు ఆవిడకి ఎవరిచ్చారండి? That is not right.”

బిగ్‌బాస్ – “బాబు గారు……..”

– బాబు గోగినేని – “One moment big boss…let me speak. From whatever little interaction I have had with her, I believe she has an adolescent fascination with ginger. ఆ ముక్క ఆవిడతో చెప్పి, “kindly…ఇది మురిక్కాలువలో పారబోయండి..” అని suggest చేసాను. తను ఒక grown-up woman కాబట్టి informed decision తీసుకుంటుంది అనుకుని, I moved on. But, ఆ కాఫీ నేనే తాగాలని పట్టుబట్టింది. What is this nonsense? I cannot consume such tripe. మన social framework లో చూస్తే….that coffee is an unmitigated disaster అండి.”

బిగ్‌బాస్ – “బాబు గారు…….”

– బాబు గోగినేని – “చూడండి…మీరు నా నౌకరు కాదు. అలా నిముషానికొకసారి “బాబు గారు” అని పిలవకండి. It makes me uncomfortable. Just call me Babu. ఆవిడ విషయానికొస్తే….

నాకు అర్థమౌతుందేంటంటే….her mental faculties are far worse than her culinary skills. చాలా నీచమైన vernacular లో…she started shouting అండి. మధ్యలో “tea is a feeling, ginger tea is an emotion” అని ఈ facebook లో వచ్చే పిచ్చి కూతలన్నీ…she started expressing. I was definitely not ok with that అండి. It all started when she said “Good morning babu gaaru” and I wished her back. I deeply regret that now.”

బిగ్‌బాస్ – “బాబు గారు……..”

– బాబు గోగినేని – “let me finish…let me finish అండి. Just to have some clarity in our discussion – ఇప్పుడు….ఆవిడ బ్రష్ కూడా చేసుకోకుండా నా దగ్గరికొచ్చి “మామూలు టీ తాగుతారా? జింజర్ టీ తాగుతారా?” అని అడిగారు. ఆ assumption ఏంటండి అసలు? నేను టీ తాగుతానని ఎవరు చెప్పారండి ఆవిడకి? ఇంత hostile environment లో….అసలు how can anyone function అండి? అందుకే ఆ అల్లం కాఫీ ఆవిడ తల మీద ఒంపేసి, ‘all the best for your future endeavours’ అని చెప్పి పక్కకొచ్చేసాను. ఈ context లో

నేను తప్పు చేసానని ఎలా నిర్ణయిస్తారు బిగ్‌బాస్? And…నన్ను ఇలా ఈ గదికి confine చేయటం…basic human rights ని కాలరాయటమే. ఈ విషయం లో adjudicate చేసే eligibility మీకు లేదు..”

బిగ్‌బాస్ – “సార్….బాబు గారు….మీరు లోపలికెళ్ళి….మీకు కాఫీ కలిపిన candidate ని ఇక్కడికి పంపండి చెప్తాను…ఈ లోపు నేనెళ్ళి ఒక చాయ్ కొట్టొస్తాను..”