తెలంగాణా ఉద్యమాన్ని ముందుండి నడిపించి, తన అద్భుత ప్రసంగాలతో ఉద్యమ స్ఫూర్తి ని రగిలించి, తెలంగాణా రాష్ట్రాన్ని సాధించింది కె సి ఆర్. ఇందులో ఎవరికీ సందేహం లేదు.

కాని ఈయన రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా?

తెలుగువారి ఆత్మ గౌరవమే నినాదం గా తెలుగు దేశం పార్టిని స్థాపించాక ఎన్టిఆర్ ఆంధ్రా తెలంగాణా అని తేడా లేకుండా అన్ని చోట్ల యువ నాయకులని ఎంకరేజ్ చేసారు. వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి మెరికల్లాంటి కొత్త నాయకులని తయారు చేసారు. అలా వచ్చిన వారిలో ఒకడు కె సి ఆర్. ఆయన అతి పెద్ద ఎన్టిఆర్ అభిమాని. అందుకే ఆయన కొడుకు, ప్రస్తుత మంత్రి కేటిఆర్ కి తారక రామారావు అని ఆయన పేరే పెట్టుకున్నారు,అఫ్కోర్స్ అప్పటికి అన్ని బావున్నాయి, తెలంగాణా ప్రాంతం అభివృద్ధి లో దూసుకుపోతుంది,అంటా వేరు. కాని చంద్రబాబు కాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపొయే సరికి తెలంగాణా వెనకపడింది, మాది మాగ్గావాలే నినాదం తెర మీదకి వచ్చింది,అది వేరే విషయం.

సరే ఆంద్ర,తెలంగాణా, తెలుగుదేశం, తె రా స ఇవన్ని రాజకీయాలు పక్కన  పెట్టేద్దాం. కాని తెలంగాణా విడిపోయాక ఈ మూడేళ్ళలో ఏనాడన్నా ఎన్టిఆర్ జయంతి కాని వర్ధంతి కాని నిర్వహించారా? ఆయన్ని స్మరించారా? తెలంగాణా వచ్చాక సడెన్ గా ఆయన ఆంధ్రుడు అయిపోయారా? తెలంగాణాలో తరాలు గా ఉన్న పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి ఏంతో మందికి మేలు చేసిన ఈ ఆంధ్రుడు ఎన్టిఆరే. తెలంగాణా కి ఆయన ఎంత చేసారో మీ రాజకీయ అనుభవం చూసింది,మీ అంతరాత్మకి తెల్సిందే. ఆయన విషయం లొ ద్వంద ప్రణామాలు ఏంటి కె సి ఆర్? ఆయనకీ ప్రాంతం,కులం,మతం ఏంటి దొర? కనీసం నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినందుకు అయిన స్మరించుకో దొర. తెలుగు మహా సభల్లో ఆయన ప్రస్తావన లేకపోవటం ఏదైతే ఉందొ అది అద్భుతం. కాని ఒకటి నిజం నీ ఇంట్లో నీ కంటి ముందే ఆయన పేరు పెట్టుకుని తిరిగే మీ కొడుకు గుర్తు చేస్తూ ఉంటాడు మీకు ఎన్టిఆర్ ఏంటి అనేది. ఏది ఏమైనా పెద్ద తప్పు చేసావు కెసిఆర్.