2014 న భారత దేశం మొత్తం మోడీ జపం చేసింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం లో అలా ఒక వ్యక్తికి అన్ని వర్గాల నుంచి మద్దతు రావటం చాల అరుదు అనే చెప్పాలి.

మోడీ పిఎం అవ్వగానే అభివృద్ధి పరుగులు పెడుతుంది, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు అంతా, కాని వాస్తవ పరిస్థితి అలా లేదు. ఎప్పుడు లేనట్టు గా కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుంది,  మిత్రపక్షాలను, ప్రతి పక్షాలను, వారి వారి వాదనలను పరిగణన లోకి తీస్కోకుండా తమకి అనిపించింది చేసుకుంటూ పోతుంది. ఎన్నికల హామీలలో ప్రధానం అయిన నల్ల ధనం వెనక్కి తీసుకు రావటం అనేది ఒక పెద్ద జోక్ గా మిగిలిపోయింది.

మోడీ ప్రభ తగ్గుతుందా లేదా అనేది గాజ్ చెయ్యటానికి గుజరాత్, హిమాచల్ ఎన్నికలను రిఫరెండం గా తీస్కోవచ్చు అని అటు బి జే పి ఇటు కాంగ్రెస్ భావించాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గుజరాత్ పీఠం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదిపింది. పటిదార్ రిజర్వేషన్,ఓబిసి వంటి అంశాలతో పాటు,కుల సంఘాల అండతో బాజాపా ను సాగనంపాలి అని గట్టి ప్రయత్నమే చేసింది.  హార్దిక్ పటేల్,అల్పేష్ ఠాకూర్,జిగ్నేష్ మోవాని లాంటి వారి మద్దతు తీసుకుని వేగం గా పావులు కలిపింది. ఇదే సమయం లో మోడీ చేస్తున్న అభివృద్ధి మంత్రంగా భాజాపా ఎన్నికలకు వెళ్ళింది. కాంగ్రెస్ పాకిస్తాన్ తో చేతులు కలిపింది అని తీవ్ర ఆరోపణలు చేస్తూ మోడి, అమిత్ షా ద్వయం ప్రచారం చేసింది.

ఈ రెండు రాష్ట్రాల్లో బి జే పి గెలిచింది కాని, ఎక్జిట్ పోల్స్ లో వచ్చినట్టు భారి గా సెలబ్రేట్ చేసుకునే విజయం కాదు, చావు తప్పు కన్ను లొట్టపోయిన చందం గా బి జే పి బయట పడింది.దాదాపు 15 సీట్స్లో దాదాపు 2000 వోట్ల తేడాతో బిజెపి గట్టెక్కింది.ఆ 15 సీట్స్ లో వోటింగ్ అటు ఇటు గా వచ్చిన కాంగ్రెస్ పాగా వేసేది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంవత్సరం మాత్రమె సమయం ఉండటం తో బాజాపా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. 2014 లో ట్రేస్ కూడా దొరక్కుండా పోయిన కాంగ్రెస్ ఈ స్థాయి లో పుంజుకోవటం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడు గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే గెలుపు మలుపు దాటాక బాజాపా జాగర్త పడాలి అని ఫలితాలు తెలియచేస్తున్నాయి.