తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నరేందర్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ హరీశ్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నియోజకవర్గంలో ఉన్న పేదలకు నిత్యావసర సరుకులు అందించే సమయంలో ఎమ్మెల్యే నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదని హరీశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దాదాపు 3000 మంది ఉన్నచోట కనీసం సామాజిక దూరం పాటించలేదని ఆరోపిస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను బీజేపీ నేత పోలీసులకు ఇచ్చారు. వీటిని ఆధారం చేసుకుని పోలీసులు ఎమ్మెల్యే నరేందర్‌పై కేసు నమోదు చేశారు.