మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు యు ఎస్‌తో పాటు ఏపీ తెలంగాణలో కూడా విడుదలైంది. ఆరు షోలకు అనుమతి ఉండటంతో మధ్య రాత్రి ఒంటిగంట నుంచి థియేటర్ల దగ్గర మహేష్ బాబు అభిమానుల సందడి కనిపించింది. ఈ చిత్రం ఎలా ఉంది మహేష్ మార్క్ మాజిక్ కనిపించిందా లేదా తెలుసుకోవాలి అంటే మా బుల్లెట్ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సరిలేరు నీకెవ్వరు ఒక రకంగా చూసుకుంటే మహేష్ బాబు వన్ మాన్ షో

కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్, డాన్సులు ఇలా అన్ని రకాలుగా మహేష్ ఆకట్టుకున్నాడు

రష్మిక మహేష్ ముందు తేలిపోయినా పాత్ర పరిధిలో బానే నటించింది

చాలా కాలం తర్వాత వెండితెర మీదకు రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరొక మేజర్ హైలెట్

మిగతా నటీనటులు అంతా పాత్ర పరిధి మేరకు నటించారు

కామెడి ఒక మోస్తరుగా ఉన్నా, ఎంటెర్టైన్మెంట్ కి ఢోకా లేదు

దేవి శ్రీ ప్రసాద్ పాటలు అక్కట్టుకోలేకపోయినా, నేపధ్య సంగీతం బావుంది

ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో మరింత మెరుగ్గా ఉండాల్సింది

అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు, పండగకి సరిపడే దానికంటే వినోదం ఎక్కువ ఉంది

ఓవరాల్ గా చూస్తే పండక్కి సరిపడా వినోదం ఉంది, మహేష్ బాబు వన్ మాన్ షో. సంక్రాంతికి కుటుంబంతో చూడగలిగే సినిమా.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3.5/5