25 వ తారీఖు ఉదయం నిద్ర లేస్తూనే భారత దేశం లో ప్రజలు ఒక్క కుదుపు కి లోనయ్యారు. తమ ఇంటి ఆడపడుచు శ్రీదేవి ఇక లేదు అనే వార్త కి షాక్ కి గురయ్యారు. శ్రీదేవి గుండెపోటు తో మృతి అన్నారు. ఇక్కడ శ్రీదేవి మరణించటం, అంత త్వరగా వెళ్ళిపోవటం ఎవరికీ నచ్చలేదు. దేవతలకు మరణం ఏంటి? అసలు నిజమేనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు, తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పుకున్నారు. బాధ పడ్డారు…తెలిసిన చాలా మంది అన్నం కూడా తినలేదు…అ ఆదివారం అత్యంత విషాదం… ఇక పోతే ఒక వేళ ఆ రోజు శ్రీదేవి బతికి ఉన్నా ఈ రోజు చనిపోయేవారు…

చావు అనేది ఒక విషాదం, ఆ విషాదాన్ని ఎప్పుడు ఒక విషాదం గా మాత్రం చెప్పలేని దగుల్బాజీ మీడియా మన సొంతం. చావు లో కూడా సెన్సేషన్ కావాలి, వివాదం దొరకాలి, అనుమానాలు ఉండాలి, వేసిన విజువల్స్ వేస్తూ రక్తి కట్టించాలి. శ్రీదేవి ఇందుకు చనిపోయిందా? అందుకు చనిపోయిందా? బోనీ చంపెసాడా? కొన్ని ఛానల్స్ అయితే బాత్ రూమ్ బాక్ గ్రౌండ్ పెట్టుకుని మరి రిపోర్టింగ్ చేసాయి…  రేటింగ్స్ కోసం చావు ని కూడా ఇంత డ్రమాటిక్ గా రిపోర్ట్ చేసే సన్నాసి మీడియా మనదే. ఒక టైమ్ లో దూరదర్శన్ వార్తలు వచ్చేవి…ఎంత కావాలో అంత ఉండేవి… జీవితం ప్రశాంతం గా ఉండేది… తర్వాత etv 9 గంటల బులెటిన్ (ఇప్పటికే ఇదే ద బెస్ట్ న్యూస్ సోర్స్) వచ్చేది, కావాల్సిన దానికంటే ఇంకాస్త ఎక్కువ వార్తలు ఉండేవి. ఆ తర్వాత వచ్చింది మీడియా ని భ్రష్టు పట్టించటానికి తొమ్మిది టివి వచ్చింది….ఒక లోఫర్ ఛానల్…మీడియా కి ఎధిక్స్ ఉండే పని లేదు అని తోలి సారి పరిచయం చేసిన తప్పుడు వార్తల ఛానల్ అది., బాల కృష్ణ షూటింగ్ ఎపిసోడ్ అప్పుడు వీళ్ళ సొంత పైత్యం కథలు గా వండి జనాల్లోకి వదిలారు. ఆయన అంబులెన్స్ ఎటు పొతే అటు ఫాలో అయ్యారు…ఆ రోజు న వాళ్ళు వండిన

ఆ వాస్తవ విరుద్ద కథలే ఈ రోజుకు జనాల్లో చలామణి అవుతున్నాయి. తర్వాత త్రిష బాత్ రూమ్ లో లీక్ అయిన వీడియో తో పెంట సైతం పాయసమే అన్న సూత్రం ఫాలో అయ్యారు. ఒక అమ్మాయి ఒక బాత్ రూమ్ లో స్నానం చేసే వీడియో ఎలా రా ముఖ్య వార్త? ఆ రోజున ఎవరు అడగలేదు, ఈ రోజు కి అలాంటి వార్తలు ఆగలేదు. ఇంటర్నెట్ కేఫ్ సెక్స్ స్కాండల్స్ నెలకి ఒకటి అన్న ఉండేది….ఆ వీడియో లో వీళ్ళకే ఎలా వచ్చేవి ఎవరు అడగరు. వీడిని చూసి ఇంకో పది పదిహేను ఛానల్స్ వచ్చాయి. పోటి పెరిగింది, ఏమి చేస్తాయ్…చావు ని కూడా వాటాలు వేసుకుంటాయ్…ఎవరికీ తోచింది వాళ్ళు జనం మీదకి రుద్దుతాయ్… ఇలా జరిగి ఉండొచ్చు అని వీళ్ళ ఊహలని షూట్ చేసి జనాల మీదకి వదులుతాయ్… ఇలా జరిగి ఉండొచ్చు…. కాదు కాదు ఇలా అని పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకటే పెంట…. ఎవడికి వాడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ లాగా ఊహలు… వెలి ముద్రలు సేకరించిన వాడిలా ఖచ్చితత్వాలు….ప్రేడిక్షన్స్, నీతులు సూక్తులు…. సర్జరీ వల్ల పోయింది అని ఒకడు, చంపేశారు అని మరొకడు…యాక్సిడెంట్ అని ఇంకొకడు… బోనీ కి శ్రీదేవి కి ఆ “పదిహేను నిమిషాలు” ఏమి జరిగింది అని కథలు, కల్పనలు. ఇవన్ని పక్కన పెడితే


“పసిపాప గా నటించిన వారి పక్కనే పరువాల పాప” గా నటించింది అన్న హెడ్ లైన్ చూసినప్పుడు రక్తం ఉడికింది. చనిపోయిన మనిషి కి పరువాలు ఏంటి రా లోఫర్ గా అని అడగాలి అనిపించింది. పోటి లో ఉన్నాం ఏమి చేస్తాం, వాడి కంటే మనం బాగా చెయ్యాలి అన్న ప్రాసెస్ లో చావు ని కూడా వదలట్లేదు….దీనికి తోడు ఎక్స్క్లూజివ్ అని వాటర్ మార్క్లు…. మా ఛానల్ లోనే ముందు చూస్తున్నారు అని రిమైండర్లు…లౌడ్ బ్రేకింగ్ న్యూస్ మ్యూజిక్ వేరే… పనికిమాలిన గ్రాఫిక్స్… నీచం గా ఉండే యాంకర్లు….భయం పుట్టించే వాళ్ళ కళ్ళలో ఆత్రుత…అంత కంటే దరిద్రం అయిన డ్రస్సులు…… ఒక మరణాన్ని మరణం గా రిపోర్ట్ చేసి వదిలేస్తే ఎంత మర్యాద…. టిఆర్పి కోసం ఆత్రుత క్రియేట్  చెయ్యండి తప్పు లేదు…ఉన్న పోటి కి తప్పదు…ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి గా….. కాని చావు ని సంచలనం చెయ్యకండి….చనిపోయిన వారిని క్షమించండి…. పసి పిల్లల చావు మీద కూడా వాటర్ మార్క్ వేసే మీ నోరు తెరిచి……థు అని ఉయ్యాలి అని ఎన్ని సార్లు అనిపించిందో….. పక్కవాడి కష్టం అంటే జనాలకి ఇష్టం అన్న సూత్రం పట్టుకుని ఇంకెన్నాళ్ళు చేస్తారు….ఇలా మెరుగైన సమాజం వస్తుందా? సమాజం నాశనం అవుతుంది, జనాల్లో సైకిక్ నేచర్ పెరుగుతుంది….. ఇది తప్పు కాదు పాపం….

ఒక్క మాట…..మరణానికి మర్యాద ఇవ్వండి…..పోయిన వారిని అక్కడితో వదిలెయ్యండి…..కాని చావు మీద మీరు చేసే వార్తలకి వచ్చే ఆదాయం…ఇంచు మించు శవం మీద పేలాలు ఏరుకుని మసాలా చేసుకుని తినటం తో సమానం. మీరు తినటం కాదు మీ ఇంట్లో వాళ్ళకి అదే పెడుతున్నారు. నిజం గా శ్రీదేవి ఆ రోజునా బతికి ఉన్నా ఈ రోజు మీరు చంపెసేవారు.