ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనచేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాగా ఈమేరకు రాష్ట్రంలోని అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికి ఇప్పటికే పలు ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఈ దీక్షలను ఎవరైనా కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ చేయాలనీ టీడీపీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కాగా రాష్ట్రం ప్రస్తుతానికి భయంకరమైన మహమ్మారి కారణంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో 3, 4 రెట్లు విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామని, ఇది అత్యంత బాధాకరమైన విషయమని చందబ్రాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశంలో కేంద్రం అన్ని రంగాలకు ఇస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలా కుట్రపూరితంగా విద్యుత్ ధరలు పెంచడం దుర్మార్గమని చంద్రబాబు నాయుడు పలు విమర్శలు గుప్పించారు.