దేశంలోనే తొలిసారిగా వేలాదిమంది ప్ర‌తినిధుల‌తో డిజిట‌ల్ పార్టీ స‌మావేశాలు నిర్వ‌హించిన ఘ‌న‌త టీడీపీ సొంతం. వెబినార్ ద్వారా నిర్వ‌హిస్తోన్న మ‌హానాడుకు కేంద్ర కార్యాల‌యానికి హాజ‌రైన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ “నారా లోకేశ్ 2.o అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. స‌న్న‌గా, స్లిమ్‌గా ఎలా మారారంటూ మీడియా ప్ర‌తినిధులు లోకేశ్‌ని అడిగారు.

 

లాక్‌డౌన్ వ‌ల్ల హైద‌రాబాద్‌లో ఇరుక్కుపోవ‌డంతో డైట్ కంట్రోల్‌తోపాటు వ‌ర్క‌వుట్స్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఆయ‌న వివ‌రించారు. 20 కేజీలు బ‌రువు త‌గ్గగ‌లిగాన‌ని చెప్పారు. నాయ‌కులు, మీడియా ప్ర‌తినిధులు లోకేశ్ చుట్టూ చేరి డైట్‌, వ‌ర్క‌వుట్స్ విష‌యాల‌న్నీ అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ అయి ఎక్క‌డివాళ్ల‌క్క‌డే వున్న‌ప్ప‌టికీ పార్టీకి సంబంధించిన స‌మావేశాలు ఆన్‌లైన్‌తో నిర్వ‌హించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన నారా లోకేశ్ రోజూ అంద‌రికీ లైవ్‌లో క‌నిపిస్తున్న ప్ర‌త్య‌క్షంగా రెండు నెల‌ల త‌రువాత చూసేస‌రికి ఎంత మార్పు అనుకుంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

 

రెండు నెల‌ల్లో 20 కేజీలు బ‌రువు త‌గ్గ‌డం అంటే ఎంత కఠోర‌మైన వ్యాయామం, డైట్ చేసి వుంటారో అర్థం అవుతోంది. తెలుగురాద‌ని ఎక్కిరించిన‌వారికి అవును..నేను తెలుగులో ఒక ప‌దం అటు ఇటు మాట్లాడ‌తానే కానీ త‌ప్పుడు ప‌నులు చేయ‌నంటూ స‌మాధానం ఇచ్చిన‌ట్టే… బాడీషేమింగ్‌కి పాల్ప‌డుతున్న వారికి కూడా స్లిమ్‌గా త‌యారై చూపించారు.

 

లాక్‌డౌన్‌కి ముందు మీడియా లైవ్‌లోకొచ్చి విమ‌ర్శ‌ల‌కు ఘాటుగా స‌మాధాన‌మిచ్చి స‌రికొత్త లోకేశ్‌గా క‌నిపించిన టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లాక్‌డౌన్ అనంత‌రం లుక్లోనూ దూకుడులోనూ నారా లోకేశ్ 2.0 అనిపించుకుంటున్నారు.