గ్రామ సచివాలయాలకు వైసీపీ పతాకంలోని రంగులు ఉండొద్దని స్పష్టంగా హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అమలు పరచకుండా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తున్న కేసు చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తన కెరీర్‌ చివరి దశ లో హైకోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. హైకోర్టు ఆదేశాన్ని నీరుకార్చే విధంగా నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడు ఎర్రమట్టిరంగును జతచేస్తూ సాహ్ని జీవో 623 జా రీ చేశారు. పార్టీ రంగులు తీసేయాలని హైకోర్టు ఆదేశించగా, దానికి ఇంకో రంగు జత చేసి మొ త్తం మార్చేశామని అటు కోర్టును, ఇటు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని అప్పుడే అధికార వర్గాల మధ్య అంతర్గత చర్చ జరిగింది.

ఆ జీవో పర్యవసానం కోర్టులో ఎలా ఉండబోతోందో ముందుగానే అందరూ ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. నీలం సాహ్ని ఈ నెల 28న కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రంగుల విషయంలో ఆమె తన సహజశైలికి భిన్నంగా, ప్రభుత్వ పెద్దల ఒ త్తిళ్లకు తలొగ్గి జీవో జారీ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రంగుల విషయంలో వ్యవహరించిన తీరుపై న్యాయవర్గాలతో సహా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులో ఎవరైనా సవాలు చేస్తే ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారులు వెళ్లి, వివరిస్తారు. కానీ ఈ కేసు విషయంలో కోర్టు ఆదేశాలను ప్రభుత్వమే అమలు చేయలేదని హైకోర్టు భావించి సీఎ్‌సతోపాటు ఇతర అధికారులను వచ్చి వివరణివ్వాలని ఆదేశించింది.