యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి వాటి మీద వచ్చే యాడ్స్ ద్వారా రెవెన్యు సంపాదించవచ్చు అనుకుంటున్నారా? లేదా ఆల్రడి యూఉత్యుబ్ ఛానల్ కి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా? కంటెంట్ క్రియేట్ చెయ్యటానికి మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారా? లేదా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియాలో ఉన్నారా? ఐతే ఈ ఆర్టికిల్ మీ కోసమే.మీరిక జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చింది, కంటెంట్ లో ఫ్రెష్నెస్ తో పాటు క్వాలిటి ఉండేలా చుస్కోవాలి. దేనికంటే మీ కంటెంట్ ఎక్కువ మంది చూడకపోతే మీరు ఇబ్బంది పడతారనే యూట్యూబ్ కొత్త పాలసీలు చెప్తున్నాయి.


మీరు యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించాలి అనుకుంటే మీఋ కనీసం గత 12 నెలల్లో మీ ఛానల్ లో 4,000 గంటల వాచ్ టైమ్ ఉండటం తప్పని సరి. అంతే కాకుండా కనీసం 1,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి తీరాలి. ఈ కొత్త రూల్ ని ఫిబ్రవరి 20 నుంచి అమలు లోకి తెస్తుంది యూట్యూబ్. ఇప్పటికే ఆల్రడి ఉన్న చానల్స్ కి కూడా ఈ రూల్ వర్తిస్తుంది.ప్రపంచవ్యాప్తం గా యూట్యూబ్ లో స్పామ్/మిస్లీడ్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అని ఫిర్యాదులు వస్తున్న నేపద్యంలో యూట్యూబ్ ఈ పాలసి తీసుకుని రావటం గమనార్హం. ముఖ్యం గా వీడియో కంటెంట్ కోసం ఉద్దేశించిన యూట్యూబ్ లో ఇమేజెస్ తో వాయిస్ ఓవర్ ఎటాచ్ చేసే కంటెంట్ ఎక్కువ అయిన నేపధ్యంలో యూట్యూబ్ ఉక్కు పాదం మోపాలని డిసైడ్ అయ్యింది. ఇక మీరు యూట్యూబ్ నుంచి రెవెన్యూ పొందాలి అంటే తప్పని సరిగా ఎంగేజింగ్ కంటెంట్ చెయ్యాల్సిందే. రోజు కి కనీసం 10 గంటల కంటెంట్ మీ చానల్ నుంచి యూజర్స్ చూస్తూనే మీకు రెవెన్యు వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్